జనసేన వర్సెస్ వైయస్‌ఆర్‌సిపి : నేడు మంగళగిరికి పవన్ కళ్యాణ్; వైసీపీ అడ్డుకుంటుందా? ఉత్కంఠ !!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలోని వైసీపీ సర్కార్ పై, వైసిపి మంత్రులపై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం ముందు ముందు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అన్న ఉత్కంఠకు కారణంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈరోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

మంగళగిరిలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలో పర్యటించనున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పై, వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, దానిపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ పై మాటల దాడికి దిగడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే పవన్ తాజా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి టూర్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉండటంతో జనసేన కార్యకర్తలు భారీగా మంగళగిరికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంగళగిరిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద పవన్ ఫ్యాన్స్ ను అడ్డుకున్న పోలీసులు
ఏపీకి పవన్ కళ్యాణ్ రాకతో కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడానికి వెళ్లిన జనసేన పార్టీ కార్యకర్తలను, పవన్ కళ్యాణ్ అభిమానులను ఎయిర్ పోర్టు గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎయిర్ పోర్టు ఆవరణలో ప్రతి వాహనాన్ని గన్నవరం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం .. బద్వేల్ ఉప ఎన్నిక పోటీపై చర్చ
ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వం పై జనసేన పార్టీ కార్యకర్తలు, నేతల విమర్శలతో నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవాలని వైసిపి కార్యకర్తలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈరోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇదే సమయంలో కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్న పవన్ కళ్యాణ్ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలతో ఈరోజు మంగళగిరిలో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా వార్ .. వైసీపీ గ్రామ సింహాలు అంటూ టార్గెట్ చేస్తున్న పవన్
ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తుంది. నిన్నటికి నిన్న వైసిపి ప్రభుత్వ పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి, సమయం ఆసన్నమైందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైసిపి సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు ప్రగతి అంటూ పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారంతా క్షేమంగా ఉన్నారని, ఎక్కడున్నాయి వైసిపి గ్రామ సింహాలు అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసిపి నేతలను టార్గెట్ చేశారు.
Recommended Video

మంత్రుల ఆగ్రహం , పోసాని తాజా వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం
సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలపై మొదలైన రగడ నేపథ్యంలో, వైసిపి పాలనను తూర్పారబడుతున్నారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి తీరును, వైసిపి మంత్రుల ప్రవర్తనను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మంత్రులు పవన్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ యుద్ధం కాస్త ట్విట్టర్ వార్ గా మరింత తీవ్రంగా మారింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మాటలయుద్దం కొనసాగుతోంది.ఇదే సమయంలో పోసాని కృష్ణమురళి పవన్ పై వ్యాఖ్యలు చెయ్యటం, ఆపై తనకు ప్రాణహాని ఉందని, తనను బూతులు తిడుతూ జనసేన నేతలు బెదిరిస్తున్నారని చెప్పటం, తనపై దాడికి ప్రయత్నం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications