జగన్ రాజీనామా డిమాండ్ తో సభలో : మంత్రి కొడాలి - రోజా ఫైర్ : స్పీకర్ పైకి కాగితాలు..!!
శాసనసభలో జంగారెడ్డి గూడెం ఘటన దుమారానికి కారణమైంది. జంగారెడ్డి గూడెం వ్యవహారంలో బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు. పెద్ద ఎత్తున నినాదాల తో హోరెత్తించారు, స్పీకర్ పోడియం ముట్టడించారు. ప్లకార్డులు చింపి స్పీకర్ పైన వేయటం పైన వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన స్పీకర్ సీరియస్ అయ్యారు. సంస్కారం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి కొడాలి నాని సభా వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సహజ మరణాలను టీడీపీ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుపై కొడాలి నాని ఆగ్రహం
మద్యపాన నిషేధం ఎత్తివేసిన చంద్రబాబు..ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. జంగారెడ్డి గూడెంలో చంద్రబాబు పర్యటన ఉండటంతో..సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశ పూర్వకంగా రభస చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని చెప్పారు.
టీడీపీ జంగారెడ్డి గూడెం మరణాలతో శవ రాజకీయ చేస్తోందని ఆరోపించారు. మరో మంత్రి కన్నబాబు సైతం టీడీపీ తీరు సైన ఆగ్రహం వ్యక్తం చేసారు. సభను జరగనీయకుండా గొడవ చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సహజ మరణాలను వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మధ్య నిషేధం తీసుకొస్తే చంద్రబాబు దానిని తొలిగించారని మండిపడ్డారు.

శవరాజకీయాలు టీడీపీ పేటెంట్ అంటూ
శవరాజకీయాలను చంద్రబాబు పేటెంట్ హక్కు తీసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. బెల్టుషాపులతో..పర్మిట్ రూమ్ లతో చంద్రబాబు అనుమతులు ఇచ్చారని గుర్తు చేసారు. ఎమ్మెల్యే రోజా చంద్రబాబు హాయంలో మద్యం అమ్మకాల పైన వివరించారు. 2014లో చంద్రబాబు ప్రమణ స్వీకారం చేసిన సమయంలో అయిదు సంతకాల్లో బెల్టు షాపులను రద్దు చేస్తామని చెప్పారని రోజా ఫైర్ అయ్యారు.
అయిదేళ్ల కాలంలో 40 వేల బెల్టు షాపులు ఓపెన్ అయ్యాయి. మద్యం సిండికేట్లతో కుమ్మక్కు అయి చంద్రబాబు మహిళల జీవితాలతో ఆడుకున్నారంటూ మండిపడ్డారు. ఇంటింటికి మంచి నీరు ఇవ్వలేదు కానీ, క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చారని చెప్పుకొచ్చారు. బడులు మూసేసి.. మద్యం షాపులను తెరిచారంటూ ధ్వజ మెత్తారు. చంద్రబాబు హయాంలో ఎనీ టైం మందు అనే విధంగా పాలన సాగిందంటూ ఫైర్ అయ్యారు.
Recommended Video

టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలి
టీడీపీ సభ్యులు మద్యం గురించి మాట్లాడుతంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. ప్లకార్డులను చింపి స్పీకర్ పైన వేయటం ద్వారా వారి సంస్కారం ఏంటో బయటపడిందంటూ రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబును మెప్పించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు.
మంత్రి బొత్సా టీడీపీ సభ్యుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం స్టేట్ మెంట్ చేసిన తరువాత వాళ్లు స్పందించాలని సూచించారు. సభలో గౌరవం లేకుండా సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ బొత్సా సీరియస్ అయ్యారు. టీడీపీ సభ్యులు మాత్రం తమ ఆందోళన వీడకపోవటంతో స్పీకర్ సభను రెండో సారి వాయిదా వేసారు.












Click it and Unblock the Notifications