జగన్ Vs చంద్రబాబు, అధికారం ఎవరిది - పబ్లిక్ పల్స్ తేల్చిన ప్రముఖ సర్వే..!!

ఏపీలో ఎన్నికల యుద్దం మొదలైంది. సీఎం జగన్ మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు జగన్ ను ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్.. అటు చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఏపీలో ఉత్కంఠగా మారుతున్న ఎన్నికల రాజకీయం వేళ ప్రముఖ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ప్రజలు పట్టం కడతారు.. పబ్లిక్ మూడ్ ఏంటనేది వెల్లడించింది.

ఎన్నికల సమరం
ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ వర్సస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా ఎన్నిక వార్ మారుతోంది. ఇప్పటికే జగన్ పార్టీలో గెలుపే ప్రామాణికంగా సీట్లలో సిట్టింగ్ లను మారుస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం 27-30 సీట్ల వరకు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇటు పాలనా పరంగానూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్ రూ 3వేలకు పెంచుతున్నారు. జనవరి నెలలోనే ఆసరా, భరోసా పథకాల అమలుకు నిర్ణయించారు. వచ్చే రెండు నెలలు ఎమ్మెల్యే అభ్యర్దులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ డిసైడ్ చేసారు. ఇటు చంద్రబాబు, పవన్ జిల్లాల పర్యటనలకు సిద్దమయ్యారు.

Janmat Polls survey predicts YSRCP Retain power in next Elections in AP with 116-118 seats

సర్వే సంస్థ అంచనాలు
ఈ సమయంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశం పైన సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హోరా హోరీ పోరు ఖాయమని భావిస్తున్న వేళ పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా జనమత్ పోల్ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది. ఇదే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలతో నిజమయ్యాయి. దీంతో, ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే..ఫలితాల పైన ఆసక్తి పెరిగింది. ఈ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 116-118 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. టీడీపీ, జనసేన కూటమి 46-48 సీట్లు గెలుస్తాయని తేల్చింది. దీని ద్వారా ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం అని స్పష్టం చేసింది.

Janmat Polls survey predicts YSRCP Retain power in next Elections in AP with 116-118 seats

వైసీపీదే అధికారం
ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ కు 61-63 స్థానాలు వస్తాయని అంచనా వేయగా..ఫలితాల్లో అదే సీట్లు కాంగ్రెస్ సాధించింది. ఇక..ఈ సర్వే జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో బీజేపీ ఒంటరిగా 309-3012, కాంగ్రెస్ 53-55 స్థానాలు గెలుస్తుందని అంచనాగా పేర్కొంది. ఈ మధ్య కాలంలో వెల్లడవుతున్న జాతీయ సంస్థల సర్వే నివేదికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.

జగన్ పూర్తిగా తాను అమలు చేసిన సంక్షేమం - ఎన్నికల్లో సామాజిక న్యాయం కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా జగన్ మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+