• search
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విచిత్రం:జపాన్ వారి వ్యాధి...గుంటూరు వాళ్లకు వచ్చింది,ఈ నగరానికి ఏదో అయిందా!

By Suvarnaraju
|

గుంటూరు:ఈ నగరానికి ఏమైంది అన్నట్లుగానే తయారైంది గుంటూరు పరిస్థితి...ఈ సిటీ వాసులు వరుస బెట్టి దాడి చేస్తున్న వ్యాధుల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. మొన్న కలరా విజృంభణ, నిన్న హైపటైటిస్,కాక్సికా వైరస్ ల దాడి తో భీతిల్లిన నగర వాసుల్లో తాజాగా మరో ప్రాణాంతకమైన వ్యాధి విస్తరిస్తోంది.

విచిత్రం ఏమిటంటే అసలు ఇది గుంటూరు నగర వాసుల్లో కనిపించడం కొత్త...ఇంకా చెప్పాలంటే అసలు భారతీయుల్లో ఈ వ్యాధి కనిపించడమే అత్యంత అరుదు. మరి ఈ వ్యాధి ఎవరికి వచ్చేదంటే...జపాన్ వాళ్లకి...అందుకే ఈ జబ్బు పేరు కూడా జపాన్ దే..."టక సుబో కార్డియోమయోపతి సిండ్రోమ్" గా పిలిచే ఈ గుండె జబ్బు ఈ మధ్య గుంటూరు వాసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా వరుసబెట్టి చిత్ర విచిత్రమైన వ్యాధులన్నీ గుంటూరు వాళ్లపై దాడి చేయడం వైద్య వర్గాలని విస్మయపరుస్తోంది.

 నిన్నటిదాకా...ఉక్కిరి బిక్కిరి

నిన్నటిదాకా...ఉక్కిరి బిక్కిరి

గుంటూరు నగరంలో ఇటీవలే కలరా బారిన పడి అధికారికంగానే 30 మంది చనిపోయినట్లు ధృవీకరించగా, అనధికారికంగా సుమారు 50 మందికి పైగానే మృతులు ఉంటారనేది స్థానికులు చెబుతున్న మాట. ఆ విధంగా అనూహ్యంగా విరుచుకు పడిన కలరా వ్యాధి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే ఆ తరువాత గుంటూరు నగరంలో హైపటైటిస్, కాక్సికా వైరస్ లు విజృంభించాయి. హైపటైటిస్ కారణంగా నలుగురు, ఐదుగురు మరణఇంచినట్లు చెబుతున్నారు. మరోవైపు నగర పరిధిలోని చిన్నారులపై కాక్సికా వైరస్ ప్రతాపం చూపింది. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకున్నా చిన్నపిల్లలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. ఈ క్రమంలో తాజాగా గుంటూరు నగరవాసుల్లో వెలుగు చూసిన మరో కొత్త వ్యాధి వైద్య వర్గాలనే నివ్వెరపరుస్తోంది.

ఆ వ్యాధి...లక్షణాలు

ఆ వ్యాధి...లక్షణాలు

ఉన్నట్టుండి ఛాతీలో భరించలేని నొప్పి...ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి...దీంతో కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడం!...ఇంత భయాందోళనల పరిస్థితుల్లో యాంజియోగ్రామ్‌ తీపిస్తే...అంతా సవ్యంగానే ఉన్నట్లు...ఎక్కడా ఏ సమస్య లేనట్లు...రక్త నాళాల్లో కూడా ఎక్కడా అడ్డంకులు ఏమీ లేనట్లు రిపోర్ట్ వస్తుంది. సరే నని హాయిగా ఊపిరి పీల్చుకుంటే...గుండె పనితీరులో అనూహ్యమైన మార్పులు!...ఈ పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా... ప్రాణాలు పోవడం ఖాయం. ఇవండీ ఇటీవల గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో కనిపిస్తున్నఒక కొత్త తరహా గుండె జబ్బు లక్షణాలు!

ఈ జబ్బు...జపాన్ ది...

ఈ జబ్బు...జపాన్ ది...

ఈ జబ్బును జపాన్ దేశంలో 90వ దశకంలో గుర్తించారు. అప్పట్లో జపాన్ లో సునామీ వల్ల లక్షల మంది జపాన్ వాసులు తమ ఇల్లూ వాకిళ్లు సర్వస్వం కోల్పోయారు. అయినవాళ్లకు దూరమయ్యారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై చనిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాలు చనిపోవడం చూసి జపాన్ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో విచిత్రంగా మృతులందరిలో గుండె పరిమాణం ఒక విధమైన ఆకారంలో పెరిగినట్లు వైద్యులు గమనించారు.

పేరు కూడా...జపాన్ దే

పేరు కూడా...జపాన్ దే

దీంతో అక్కడి వైద్య వర్గాలు ఈ జబ్బు పేరు "టక సుబో కార్డియోమయోపతి సిండ్రోమ్‌"గా నామకరణం చేశారు. ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే
జపాన్‌ సముద్రాల్లో చేపలు పట్టేందుకు అక్కడి మత్స్యకారులు "టక సుబో" అనే ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉండే పాత్ర లాంటిది వాడతారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో కూడా గుండె ఆ పాత్ర ఆకారంలో సాగినట్లు గుర్తించిన జపాన్ వైద్యులు ఈ జబ్బుకు ఆ వల పేరును సూచిస్తూ "టక సుబో కార్డియోమయోపతి సిండ్రోమ్" అనే పేరు పెట్టారు.

ఈ వ్యాధి...ఎందుకొస్తుందంటే?

ఈ వ్యాధి...ఎందుకొస్తుందంటే?

మనిషి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనప్పుడు...గుండె పరిమాణం అనూహ్యంగా పెరుగుతోందని, మళ్లీ ఒత్తిడి తగ్గితే సాధారణ స్థితికి చేరుకుంటుందని గుంటూరులోని హార్ట్ స్పెషలిస్టులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో గుంటూరులో ఈ తరహా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు తెలిపారు. కేవలం ఈ నగరంలోనే కాదని రాష్ట్రంలోనూ పలుచోట్ల టక సుబో కార్డియోమయోపతి కేసులు బైటపడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. మరి కొందరు వైద్యనిపుణులు ఈ "టక సుబో కార్డియోమయోపతి" కేసులు కొత్తవేమీ కాదని...దీన్నేఇక్కడి వైద్యులు "ఎక్యూట్‌ ఎపియల్‌ బెలూనింగ్‌ సిండ్రోమ్‌" గా వ్యవహరించే వారని చెబుతున్నారు.

కాపాడండి ఇలా...జాగ్రత్తలు...

కాపాడండి ఇలా...జాగ్రత్తలు...

బాధితుల్లో ఈ జబ్బు లక్షణాలు గుర్తించిన వెంటనే ఐసీయూలో రెండు, మూడు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని అని వైద్యులు తెలిపారు. అత్యంత ఆప్తులైన వారు మరణించిన విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన కారణంగా వారిని ఎంతగానో ప్రేమించే ఆత్మీయులు కూడా హఠాత్తుగా గుండె ఆగి చనిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటాయని, అది ఈ టక సుబో కార్డియోమయోపతి కారణంగానేనని వైద్య వర్గాలు విశ్లేషఇంచాయి. దీన్నే పాశ్చాత్యులు బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌గా గా కూడా పిలుస్తారని జీజీహెచ్‌ కార్డియాలజీ వైద్య నిపుణులు వివరించారు...ఏదేమైనా గుంటూరు నగరంలో హఠాత్తుగా వ్యాధుల విజృంభణ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని కొందరు స్థానికులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

గుంటూరు యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
20,91,075
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  48.71%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  51.29%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  19.41%
  ఎస్సీ
 • ఎస్టీ
  3.30%
  ఎస్టీ

English summary
Weird diseases are growing in Guntur City. The cholera and and various viruses attacks of recent times, the city has expressed fear over the spread of new heart disease "Takotsubo cardiomyopathy". .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more