చందబాబు ఆలోచన భేష్: అమరావతి భద్రతకు జపాన్ కంపెనీ సాయం
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని 'అమరావతి'ని అన్ని విధాలా అత్యంత అద్భుతంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషిచేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజధానిలో భద్రత కూడా అదే విధంగా ఉండాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంతో అమరావతి భద్రతపై ప్రపంచ సంస్ధలతో సంప్రదింపులు జరుపుతోంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ భద్రతా సేవల ప్రసిద్ధ ఎన్‌ఈసీ తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రాజధాని అమరావతిని సురక్షితమైన రాజధాని నగరంగా, శాంతి భద్రలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా అత్యాధునికమైన సాంకేతిక, అవసరమైన వ్యూహాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఎన్‌ఈసీతో చర్చలు జరుపుతోంది. ఎన్‌ఈసీ విషయానికి వస్తే ఇంధన, పారిశ్రామిక, సైబర్, వైద్య తదితర లాంటి కీలక రంగాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో రాజధాని అమరావతిలో భద్రత విషయంలో మరికొన్ని కార్పోరేట్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నట్లు ఉన్నతస్థాయి పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడలో భద్రత ఎలా ఉండాలి, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ, బయోమెట్రిక్స్ నిర్వహణ గురించి తొలిదశలో చర్చించినట్లు సమాచారం. దీనిపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ పలు అంతర్జాతీయ సంస్థలు అమరావతి, విజయవాడ భద్రత వ్యూహాల సాయానికి ముందుకొచ్చాయని తెలిపారు.












Click it and Unblock the Notifications