జపాన్, సింగపూర్ పోటీ: రాజధానిపై బాబు (పిక్చర్స్)

ఏలూరు: రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను ఆకర్షణీయ జిల్లాగా మొట్టమొదట తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. స్మార్ట్ గ్రామ పాదయాత్ర చేసేందుకు వచ్చిన చంద్రబాబు సోమవారం రెండోరోజు కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు, బ్రాహ్మణగూడెం, ఎస్ ముప్పవరం, పూనగట్ల, గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కూడళ్లలో మాట్లాడారు.

తన సొంతూరు నారావారిపల్లె కంటే ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఏప్రిల్ నుండి 5 కిలోల బియ్యం అందిస్తామన్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి మాణిక్యాల రావు, ఎంపీలు మురళీ మోహన్, సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్‌లు చింతమనేని ప్రభాకర్, రామ్మోహన్ రావు, ఎమ్మెల్యేలు జవహర్, శేషా రావు, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, రాధాకృష్ణ, శివ, రామానాయుడు తదితరులు ఉన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్‌ విగ్రహానికి ఒక శక్తి ఉందని, తిరుమలలోని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, ఆయన దీవిస్తే మీ కష్టాలు ఎలా తీరతాయో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలచుకుని, ఆయన విగ్రహాన్ని ఒక్కసారి చూసుకుని ఏ సంకల్పం చేసినా, అది జయప్రదం అవుతుందని, దానికి ఢోకానే ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్‌ ఒక ఆదర్శమని, ఈ తరాలకే కాకుంమా భావి తరాలకు కూడా ఒక ఆదర్శమని, వేంకటేశ్వరస్వామి ఎలా ఉంటాడో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్‌ రూపంలో దేవుడిని చూసుకునే సంస్కృతి వచ్చిందని, ఎన్టీఆర్ దేవుడితో సమానమని ఆయన అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగు వారి గుండెల్లోంచి ఎన్టీఆర్‌ను ఎవరూ తొలగించలేరని, ఎన్టీఆర్‌ రికార్డును ఎన్టీఆర్‌ తిరిగి పుడితేనే బ్రేక్‌ చేయగలరని, అంతేతప్ప మరెవరూ చేయలేరని చాగల్లులో జరిగిన సభలో చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

మనం ఎక్కడైనా పని చేయవచ్చు, ఎంత పెద్ద హోదాలో అయినా ఉండొచ్చు గానీ మన ఊరుని మాత్రం మరిచి పోకూదని, దాతల రూపంలో జన్మభూమి రుణం తీర్చుకోవాలని, ఏపీని స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కలిసి రావాలతీచంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

స్మార్ట్‌ విలేజ్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. సమాజమే దేవాలయమన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే ‘స్మార్ట్‌ ఏపీని' తీర్చిదిద్దుదామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాను ఆకర్షణీయ జిల్లాగా మొట్టమొదట తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

స్మార్ట్ గ్రామ పాదయాత్ర చేసేందుకు వచ్చిన చంద్రబాబు సోమవారం రెండోరోజు కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు, బ్రాహ్మణగూడెం, ఎస్ ముప్పవరం, పూనగట్ల, గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కూడళ్లలో మాట్లాడారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తన సొంతూరు నారావారిపల్లె కంటే ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఏప్రిల్ నుండి 5 కిలోల బియ్యం అందిస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబుతో పాటు మంత్రి మాణిక్యాల రావు, ఎంపీలు మురళీ మోహన్, సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్‌లు చింతమనేని ప్రభాకర్, రామ్మోహన్ రావు, ఎమ్మెల్యేలు జవహర్, శేషా రావు, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, రాధాకృష్ణ, శివ, రామానాయుడు తదితరులు ఉన్నారు.

రెండు రోజుల పాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన అనంతరం రాత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి అఢిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలని సూచించారు. గతంలో ఉన్న సాఫ్టువేర్ ఇబ్బందుల వల్ల రుణమాఫీ విషయంలో కొంత ఇబ్బంది జరిగిందన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని రాజధాని నిర్మాణం చేస్తామని, ఇందుకు సింగపూర్, జపాన్ దేశాలు పోటీ పడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. తాము ఐదు అంశాలతో ముందుకెళ్తున్నామన్నారు. 20 రంగాల్లో ప్రగతి తమ లక్ష్యమని చెప్పారు. ఎన్టీఆర్‌ను స్మరిస్తే పనులు పూర్తవుతాయని చంద్రబాబు చెప్పారు. చాగల్లులో తాను దాచుకున్న హుండీలోని డబ్బును ఓ బాలిక రాజధాని నిర్మాణం కోసం ఇవ్వగా... చంద్రబాబు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+