జవాద్ తుఫాన్: కాకినాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం; సీఎం జగన్ ఆదేశాలతో యంత్రాంగం అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జవాద్ ముప్పు పొంచి ఉంది. జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జవాద్ తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ బీచ్ రోడ్డు వైపు, ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్ లోనూ రాకాసి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డు పైకి సముద్రపు అలలు వచ్చి పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు తమ బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

జవాద్ తుఫాను నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో తీర ప్రాంత ప్రజలు
కాకినాడ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలు జవాద్ తుఫాను నేపథ్యంలో తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అలల తాకిడికి రక్షణగా వేసిన జియో ట్యూబ్ తెగి రోడ్డుపై రాళ్ళు పడుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక జవాద్ తుఫాను నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జవాద్ తుఫానును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న అన్ని జాగ్రత్తలను వివరించారు.
జిల్లా కలెక్టర్ లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
జవాద్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ముందస్తు చర్యలను పటిష్టంగా చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంత కలెక్టర్లకు జవాద్ తుఫానును ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉభయగోదావరి జిల్లాలకు తుపాను ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

తుఫాను ముందస్తు చర్యలపై సీఎం కు వివరించిన జిల్లా కలెక్టర్లు
ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఒడిస్సాలో కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్న కారణంగా, ఏజెన్సీ లో ఉన్న గర్భిణీ మహిళలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సమీప ఆసుపత్రులకు తరలించి వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు జిల్లాల కలెక్టర్లు. తుఫాను కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా నియంత్రించటం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు. ఇక జిల్లాలలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లకు వస్తున్న ఇన్ ఫ్లోను నిరంతరం పరిశీలిస్తున్నామని, పొంగిపొర్లటం, గండ్లు పడటం వంటి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా తగిన చర్యలు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని వెల్లడించారు.

కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు, అన్ని శాఖల అధికారులతో సమన్వయంపై సీఎం కు వివరణ
అంతేకాదు విద్యుత్, రహదార్లు, త్రాగునీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఎటువంటి అంతరాయం ఏర్పడినా వెంటనే పునరుద్దరించేందుకు ఆయా శాఖల అధికారులు సిబ్బందితో ప్రత్యేక బృందాలను కూడా సిద్దంగా ఉంచామని పేర్కొన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల ద్వారా తుఫాను పరిస్థితులను 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని,అవసరమైన తక్షణ చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగాన్ని సంసిధ్దం చేశామని ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం అన్ని కీలక శాఖల అధికారులను సభ్యులుగా చేర్చి జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించామని తెలిపారు.

జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలకు విజ్ఞప్తి
ఇక ఇదే సమయంలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. కార్తీక అమావాస్య పురస్కరించుకొని నదులు, సముద్రాలు, కాలువలు, చెరువులలో స్నానాలు చేసే సమయంలోనూ, దీపాలు వదిలే సమయంలోనూ జాగ్రత్త వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా అత్యంత జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక అధికార యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది .
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications