పవన్‌కల్యాణ్ ఎంట్రీపై జెపి: ఉన్నపార్టీతోనే సర్దుకుంటారా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం స్పందించారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన స్పందించారు. పవన్ వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో లేదా లోక్‌సత్తా పార్టీలో చేరే అంశంపై పరిశీలిస్తున్నారట. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపి ప్రస్తుతానికి ఢిల్లీకే పరిమితం అయింది. లోక్‌సత్తా పార్టీ ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చేంత ప్రభావం లేదు.

అయితే, పవన్ కల్యాణ్ ఈ రెండు పార్టీలలో ఎందులో చేరినా అది ఆ పార్టీలకు లాభిస్తుంది. పవన్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎక్కువగా లేవంటున్నారు. యువరాజ్యం పేరు వినిపిస్తోంది. అయితే, ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ఏదో ఒక పార్టీతో ముందుకెళ్లడమే మంచిదని కూడా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రెండో వారంలో రాజకీయాలపై ప్రకటన చేస్తానని పవన్ చెప్పినప్పటి నుండి హాట్ హాట్‌గా మారింది. అయితే, ఆయన ఏ పార్టీలో చేరరని, సోదరుడు చిరంజీవితో విభేదాలు ఉన్నాయనే ప్రచారం దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్నయ్యతో కలిసే ఉంటానని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications