రిజర్వేషన్ల పేరుతో బద్దకిస్టులుగా, యనమల అడ్డాలో ఈ పరిస్థితా?: జేపీ అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నియోజకవర్గంలో ఇంత దారుణ దుస్థితా.. అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నియోజకవర్గంలో ఇంత దారుణ దుస్థితా.. అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

'ప్రజల కోసం జేపీ' పేరుతో సురాజ్యయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. చిన్న పనుల ద్వారా పెద్ద ఫలితాలు రాబట్టవచ్చన్నారు.

యనమల ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు

యనమల ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు

తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 650 మంది విద్యార్థులు ఉండగా అక్కడ ఆరుగురు లెక్చరర్లే ఉన్నారని జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. యనమల ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణంలో దీనిని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు.

మైదుకూరులో 50 మందికి 13 మంది లెక్చరర్లు

మైదుకూరులో 50 మందికి 13 మంది లెక్చరర్లు

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో 50 మంది విద్యార్థులున్న డిగ్రీ కళాశాలలో 13 మంది లెక్చరర్లు ఉన్నారని జెపి అన్నారు. ఇలాంటి విషయాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చేందుకే తాను సురాజ్య యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా మురికికంపు

ఇప్పుడు ఎక్కడ చూసినా మురికికంపు

ఏ ప్రభుత్వమైనా శాంతి, భద్రత, రక్షణ, న్యాయం కల్పించాలని జెపి అన్నారు. కాకినాడ చరిత్ర చూస్తే ఎంతో ఘనమని, కాని ఎక్కడ చూసినా మురికికంపు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అతలాకుతలమవుతున్నారన్నారు. ఉన్నత వ్యవస్థ కోసం దేశాన్ని నడిపించే విద్యార్థులు ముందుకు రావాలన్నారు.

శక్తికి మించి చదివిస్తున్నారు

శక్తికి మించి చదివిస్తున్నారు

విద్య విషయానికొస్తే కూడికలు, తీసివేత, భాగాహారం కూడా తెలియని 8వ తరగతి విద్యార్థులున్నారు. శక్తికిమించి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివిస్తున్నారు. కాని ఆశించినస్థాయిలో ఉన్నతస్థాయిలో నిలవలేకపోతున్నారన్నారు.

రిజర్వేషన్ల పేరిట బద్దకస్తులను

రిజర్వేషన్ల పేరిట బద్దకస్తులను

రిజర్వేషన్ల పేరిట విద్యార్థులను ప్రభుత్వం బద్దకస్తులను చేస్తోందని జెపి అన్నారు. రిజర్వేషన్లు కల్పించి ఉన్నతవిద్యలో ప్రవేశం కల్పించి వారిని నిరుద్యోగులుగా చేయటం కంటే ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+