వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీని 'శిఖ' త‌ర‌గ‌..! ఎంత ప‌ని చేసింది..! సొంత మామను అంతం చేసిందా?

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : వ‌రుస‌కు మేన మామ‌..! బంధాలు, బంధుత్వాలు. ఇంగిత జ్ఞానం అన్నీ మ‌ర్చిపోయి అత‌నితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. అక్ర‌మ సంబందం వెన‌క అనేక ఆర్థిక లావాదేవీలు. విలాస‌వంత‌మైన జీవితం కోసం ఎంద‌రికో వ‌ల‌. వ‌లలో చిక్కిన రాకేష్ రెడ్డి. మామ చిగురు పాటి జ‌య‌రాం ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కావ‌డంతో ప‌రిచ‌యాలు కూడా తేలిగ్గానే అయ్యేయి. ఇవ‌న్నీ కార్పోరేట్ జీవితాన్ని అంట‌గ‌ట్టాయి. ఖ‌రీదైన కార్లు, విదేశీ ట్రిప్పులు, విల్లాల్లో నివాసాలు. అన్నీ అప్పుచేసే..! అప్పుతీర్చాల‌ని ఒత్తిడి పెర‌గ‌డంతో అంతం చేయాల‌ని కుట్ర‌. ఇదీ చిగురుపాటి జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి జీవ‌న స‌ర‌ళి..! తాను నిర్మించుకున్న అప్పుల రంగుల ప్ర‌పంచం త‌న‌నే ద‌హించివేసే వ‌ర‌కూ వెళ్లింది. ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మ‌న్ చిగురుపాటి జ‌య‌రాం మ‌ర్డ‌ర్ వెన‌క తిరుగుతున్న శిఖా చౌద‌రి, రాకేష్ రెడ్డి ఏం చెబుతున్నారు. తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ..! మేన‌కోడ‌లు శిఖా చౌద‌రివైపై అంద‌రి చూపు..!!

జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ..! మేన‌కోడ‌లు శిఖా చౌద‌రివైపై అంద‌రి చూపు..!!

చిగురు పాటి జ‌య‌రాం వ్యాపార రంగంలో మంచి అందె వేసిన చెయ్యి. దుందుడుకు స్వాభావంతో ముందుకు వెళ్లే త‌త్వం. దేన్నయినా డ‌బ్బుతో శాసించొచ్చు అనేతంగా ఎదిగిపోయిన పారిశ్రామిక వేత్త‌. కాలం అలాగే ఉంటే.. జ‌య‌రాం విజేత‌గా ఉండేవాడు. కానీ విలాసాలు, అస‌హ‌జ వాంఛ‌లు ఆయ‌న అంతానికి పునాదులు వేసాయి. కోట్లు కుమ్మరించి మ‌రీ సుఖాన్ని ఆస్వాదించాడు. అదే త‌న అంతానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని గ్రహించ‌లేక‌పోయాడు. ఇప్పుడు అవే కోట్లు జ‌య‌రాం మ‌ర్డర్ కి కార‌ణం అయ్యాయి. కేవ‌లం నాలుగున్నర కోట్ల రూపాయ‌లే జ‌య‌రాం కుక్క చావుకు కార‌ణ‌మంటూ పోలీసులు లెక్క గ‌డుతున్నారు. దాని వెన‌క ఉన్న‌ది కూడా సొంత మేన‌కోడ‌లు శిఖా చౌద‌ర‌ని అంచ‌నాకు వ‌స్తున్నారు పోలీసులు.

విలాస వంత‌మైన జీవితం కోసం మామ‌తో సంబందం..! చివ‌రికి ప్రాణాల‌ను తీసింది..!!

విలాస వంత‌మైన జీవితం కోసం మామ‌తో సంబందం..! చివ‌రికి ప్రాణాల‌ను తీసింది..!!

కోట్లాది రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యం. విలాస‌వంత‌మైన జీవితం. అంతా పేక‌మేడ‌ల నిర్మాణం.. తాను భ‌య‌ప‌డ్డ‌ట్టే అంతా జ‌రిగిపోయింది. అప్పులు, అక్ర‌మ సంబందం, పాపాలు, మోసాలు ఇవ‌న్నీ మెడ‌కు చుట్టుకుంటాయ‌ని ఊహించాడు. అందుకే వీట‌న్నింటికీ దూరంగా కుటుంబానికి ద‌గ్గర‌ కావాల‌నుకున్నాడు. కానీ ఇంత‌లో ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కాడు. దారుణంగా హ‌త్యకు గుర‌య్యాడు. ఫార్మా అధినేత చిగురుపాటి జ‌య‌రాం మ‌ర్డర్ చుట్టూ అస‌లైన వాస్తవం ఆయ‌న మేన‌కోడ‌లు శిఖా, ఆమెకు స‌హ‌క‌రించిన స్నేహితుడు రాకేష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారిస్తున్నారు.

 చెలికాడుతో క‌లిసి సొంత మామ హ‌త్య‌కు కుట్ర‌..! నిజ నిర్థార‌ణ‌లో పోలీసులు..!!

చెలికాడుతో క‌లిసి సొంత మామ హ‌త్య‌కు కుట్ర‌..! నిజ నిర్థార‌ణ‌లో పోలీసులు..!!

కేసులో కీల‌క‌మైన నిందితులు రాకేష్‌రెడ్డి, శిఖా చౌద‌రి అలియాస్ మాదురి చౌదరి. ఇద్దరిదీ ఒకేమాట‌. డ‌బ్బు, ఆర్ధిక వాదేవీల‌తోనే విచ‌క్షణ కోల్పోయి చేసిన దారుణ‌మ‌ని. శిఖా మ‌రో అడుగు ముందుకేసింది. అవును, నేను ఆయ‌న‌తో క‌లుస్తాను. ఆయ‌నే కాదు, చాలామంది అంటూ నిర్బయంగా చెప్పటమే కాకుండా త‌న వ్యక్తిగ‌త జీవితంతో మీకెందుకు అనేంత‌గా పోలీసుల‌ను భ‌య‌పెడుతోంది శిఖా చౌద‌రి.

హ‌త్య‌తో త‌న‌కు సంబందం లేదంటున్న శిఖా..! కేసు హైద‌రాబాద్ కు బ‌దీలీ అయ్యే ఛాన్స్..!!

హ‌త్య‌తో త‌న‌కు సంబందం లేదంటున్న శిఖా..! కేసు హైద‌రాబాద్ కు బ‌దీలీ అయ్యే ఛాన్స్..!!

ఇదిలా ఉండ‌గా శిఖా చెబుతున్న విష‌యాల‌కు, జ‌రిగిన సంఘ‌ట‌న‌కు ఎక్కడా పోలిక లేదు. పైగా, తాను స్వయంగా యాంక‌ర్‌ను ఎర‌గా చూపి, త‌న ఆస్తిప‌త్రాలు తీసుకునేందుకు ప్రయ‌త్నించిన‌ట్టు అంగీక‌రించింది. ఇదే స‌మ‌యంలో నాలుగ‌న్నర‌ కోట్ల కోసం రాకేష్ బెదిరించాడంటుంది. అయితే, హ‌త్య జ‌రిగిన రోజు ముగ్గురు జూబ్లీహిల్స్ హోట‌ల్‌లో క‌ల‌సిన మాట వాస్తవం అనేది సీసీ కెమెరాలు చెబుతున్న నిజం. కానీ, తాను మాత్రం మ‌రో చెలికానితో అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్ కు వెళ్లానంటూ బుకాయిస్తుంది. కేసులో త‌న ప్ర‌మేయం ఎక్కడా లేద‌నేందుకు అనుగుణంగా ప‌క‌డ్బందీగా అల్లిన క‌ట్టుక‌థ‌ను మించేలా త‌న వాద‌న వినిపిస్తోంది. మ‌రి కేసు ఏపి నుండి తెలంగాణ కు బ‌దిలి ఐతే తెలంగాణ పోలీసులు శిఖా వైఖ‌రి ప‌ట్ల ఏపి పోలీసులు అనుస‌రించిన విధానాన్నే అనుస‌రిస్తారా లేక త‌మ‌దైన క్ర‌మంలో నిజాల‌ను కక్కిస్తారా..? చూడాలి.

English summary
On the day of Jayaram's death, Shikha Chowdhury is saying that she is going for a long drive at midnight. Shikha Chaudhary has argued that she should not be involvement in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X