ఏడుపు ఆగలేదు: ఉదయ్ కిరణ్ మృతిపై జయసుధ

Jayasudha
హైదరాబాద్: ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ప్రముఖ నటి, సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ మంగళవారం అన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు చూసేందుకు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని ఫిలిం చాంబర్‌కు తరలించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మృతిని తట్టుకోలేక ఏడ్చానని, ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని అన్నారు. అతను తీసుకున్నది సరైన నిర్ణయం కాదన్నారు.

కాగా, ప్రముఖ తెలుగు హీరో ఉదయ్ కిరణ్ మరణించడం దురదృష్టకరమని, అతని భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయ్ మరణాన్ని ఊహించలేకపోయామని, ఈ అఘాయిత్యానికి కారణభూతులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉదయ్ కిరణ్ మృతి పట్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి మరణాలు ఉండకూడదన్నారు. సినీ జీవితాల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటైందని, ఏది ఏమైనా బతికుండి సాధించుకోవాలని నన్నపనేని హితవు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+