చిరంజీవి విలీనం చేసినప్పుడే: పవన్‌కళ్యాణ్‌పై జయసుధ
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకాస్త ముందే పార్టీ పెట్టి ఉండే బాగుండేదని ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు జయసుధ అభిప్రాయపడ్డారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసినప్పుడే.. పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుండేదన్నారు.
ప్రజలకు సేవ చేయాలనుకునే వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చునని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనంటే రాజకీయాలు కూడా ఓ మార్గమని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు వివిధ రకాల కామెంట్లు వస్తాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

2019లో వస్తే బావుంటుంది: అవంతి
పవన్ కళ్యాణ్ 2019లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యుడు అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం సినిమా రంగానికి పవన్ అవసరం ఉందన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు కాకుండా ఇంకా కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెడితే బాగుంటుందన్నారు. పవన్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఆయన జనసేన పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరును నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications