జయసుధ, జయప్రద ప్రచారం: కెవిపి ఎందుకో.. పొన్నాల

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అలనాటి హీరోయిన్లు, రాజకీయ నాయకులు అయిన జయసుధ, విజయశాంతిలు ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి, టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం చెప్పారు.

పొన్నాల లక్ష్మయ్య హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. ఈ సమయంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. కెసిఆర్ తమను తిడుతున్నారంటే ఓటమిని అంగీకరిస్తున్నట్లే అన్నారు. తమను తిడితే ఓట్లు పడతాయని కెసిఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Jayasudha, Vijayasanthi to campaign in Telangana

కెసిఆర్‌కు కెవిపి జపం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో జయసుధ, విజయశాంతి, జయప్రదలు ప్రచారం చేస్తారని చెప్పారు. నిజామాబాదులో జరగనున్న రాహుల్ గాంధీ మీటింగ్ సమన్వయం కోసం తాను వెళ్తున్నానని చెప్పారు. కరీంనగర్లో సోనియా గాంధీ సమావేశం జరిగినంత గొప్పగా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు.

సోనియాను, కాంగ్రెసు పార్టీని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు ఎవరినీ నమ్మడం లేదన్నారు. పోలవరం జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. అయితే, కొన్ని క్లియరెన్స్ రాలేదని అందుకే, జాతీయ హోదా ఆలస్యమైందని చెప్పారు. కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+