Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీలోకి వచ్చేందుకు జేసీ బ్రదర్స్ - అదే కండీషన్: బైరెడ్డి సిద్దార్ధరెడ్డి..!!

వైసీపీలోకి వచ్చేందుకు జేసీ బ్రదర్స్ రెడీగా ఉన్నారంటూ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి చెప్పుకొచ్చారు.

జేసీ బ్రదర్స్ పై శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజా సంక్షేమ యాత్ర ముగింపు వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో దశాబ్దాల కాలంగా రాచరికం చేసారని..బెదిరింపులు..దౌర్జన్యాలతో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్ గేట్లు ఓపెన్ చేస్తే టీడీపీలో ఎవరూ మిగలరని చెప్పారు. జిల్లాలోని టీడీపీ నేతలు తాము గెలిచినా గెలవకున్నా టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీలోకి వచ్చేందుకు జేసీ బ్రదర్స్ రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తాడిపత్రి పర్యటనలో బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి తన తాడిపత్రిలో మాటల తూటాలు పేల్చారు. చిత్తూరు లో ఒకరు పాదయాత్ర చేస్తూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా లోకేష్ పైన విమర్శలు చేసారు. జగన్ పౌరుషం గురించి లోకేష్ అడుగుతున్నారని ఎద్దేవా చేసారు. జగన్ దెబ్బకు సీమలో ఫ్యాక్షన్ వదిలి భార్యా పిల్లలతో వ్యవసారం..వ్యాపారం చేసుకుంటున్నారని వివరించారు. చంద్రబాబుకు కొద్ది రోజుల క్రితం వరకు కుప్పం ప్రజలు కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నెలకు ఒకసారి కుప్పంకు పోతున్నారని చెప్పారు. కుప్పం ప్రజల విలువ చంద్రబాబుకు తెలిసేలా జగన్ చేసారని పేర్కొన్నారు. టీడీపీకి 75-80 నియోజకవర్గాల్లో అభ్యర్దులు లేరని చెప్పుకొచ్చారు. సీమలోని 30 నియోజకవర్గాల్లో టీడీపీ బీ ఫాం ఇచ్చినా పోటీకి సిద్దంగా లేరని చెప్పారు. టీడీపీ ప్రజల్లో లేదన్నారు.

JC Brothers Ready to join in YSRCP: Byreddy Sidhartha Reddy Senstional comments at Tadipatri.

తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో ఏదో జరుగుతోందని చెబుతున్నారని...సేవ్ తాడిపత్రి నినాదాలు ఇస్తున్నారని చెప్పారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తాడిపత్రిలో దౌర్జన్యాలు లేవని..రౌడీ మామూళ్ల వసూళ్లు లేవని వివరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి సీటు తాడిపత్రి అని చెప్పుకొచ్చారు. తాడిపత్రి ప్రజలు జేసీ కుటుంబం నుంచి కాపాడే వాడే లేడా అని చూసిన ప్రజలకు పెద్దరెడ్డి రూపంలో స్వేచ్చ లభించిందన్నారు. బస్సులు అక్రమంగా నడిపి సామాన్యుల ప్రాణాలు తీసారని ఆరోపించారు. విపక్ష నేతగా నాడు జగన్ తాడిపత్రి వస్తే అడ్డుకొనేందుకు ప్రయత్నించారని గుర్తు చేసారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ప్రజాస్వామ్యం నెలకొల్పారన్నారు. మూడు దశాబ్దాల కష్టమే పెద్దిరెడ్డి ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ పెద్దారెడ్డికి అండగా నిలవాలని సిద్దార్ధ రెడ్డి పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+