• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జేసి బ్ర‌ద‌ర్స్ ఔట్‌: అనంత‌లో కొత్త రాజ‌కీయం : అక్క‌డి నుండి పోటీలో వారే..!

|

సాధార‌ణ ఎన్నిక‌ల ముందు జేసి బ్ర‌ద‌ర్స్ కీల‌క నిర్ణ‌యం. అనంత‌పురం లో కొత్త త‌ర‌హా రాజ‌కీయం. అనంత జిల్లాలో జేసి బ్ర‌ద‌ర్స్ హ‌వాకు ఇక అడ్డుక‌ట్ట‌. ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేన‌ట్లే. వారి స్థానాల్లో బ‌రిలోకి దిగేది ఎవ‌రో ఇప్ప‌టి కే సుస్ప‌ష్టం. వీరి ప్ర‌భావం అనంత వ‌ర‌కే ప‌రిమితం అవుతుందా..మ‌రి..టిడిపికి వారి నిర్ణ‌యం లాభ‌మా- న‌ష్ట‌మా. వైసిపి పై రాజ‌కీయంగా ప‌డే ప్ర‌భావం ఏంటి..

ఆధిపత్యం కోసం ఆరాటం..అధినేత సూచ‌న‌లివే..!

ఆధిపత్యం కోసం ఆరాటం..అధినేత సూచ‌న‌లివే..!

వ‌చ్చే ఎన్నిల్లో జేసి బ్ర‌ద‌ర్స్ పోటీ నుండి త‌ప్పుకున్న‌ట్లే. ఇప్ప‌టికే అనంత జిల్లాలో ఆధిప‌త్యం కోసం టిడిపి నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జేసి పెత్త‌నం ఎక్కువైదంటూ టిడిపి ఎమ్మెల్యే లు ముఖ్య‌మంత్రికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జేసి సైతం కొంత మంది ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మార్చ‌క పోతే పార్టీ కి న‌ష్ట‌మ‌ని సీయం దృష్టికి తీసుకొచ్చారు. అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రి వ‌ర్సెస్ జేసి బ్ర‌ద ర్స్ అన్న‌ట్లు అక్క‌డ ప‌రిస్థితి మారింది. ఆ పంచాయితీ ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ చేరింది. ఇక‌, ప్ర‌భాక‌ర చౌద‌రి రాజ‌కీయా ల్లో ఎప్పుడూ దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరుంది. ఈ ప‌రిస్థితుల్లో టిడిపి నుండి మీకు కాకుండా..మ‌రెవ‌రి పేర్లైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సూచించాల‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో..జేసి బ్ర‌ద‌ర్స్ కొంత కాలం గా జిల్లా రాజ‌కీయాల్లో త‌మ ప‌ట్టు కొన‌సాగిస్తూనే..అధినేత నిర్ణ‌యం మేర‌కు వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

జేసి బ్ర‌ద‌ర్స్ ఔట్‌.. రాజ‌కీయంగా ఎవ‌రికి న‌ష్టం..!

జేసి బ్ర‌ద‌ర్స్ ఔట్‌.. రాజ‌కీయంగా ఎవ‌రికి న‌ష్టం..!

వ‌చ్చే ఎన్నిక‌లు టిడిపి - వైసిపి కి కీల‌కంగా మారుతున్నాయి. ప్ర‌తీ సీటులో గెలుపు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. దీంతో.. ఎక్క‌డా ఎటువంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం లేకుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. ఇందు లో భాగంగానే..వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి సైతం సూచించారు. దీంతో.. వ‌చ్చే ఎన్నిక ల్లో వీరు పోటీ చేస్తే..వ్య‌తిరేక‌త పార్టీ పై ప‌డుతుంద‌నే భావ‌న జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు అధినేత వ‌ద్ద వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇక‌, ఇవ‌న్నీ చూపిన త‌రువాత‌..తాము నేరుగా పోటీలో లేకుండా..తెర వెనుక ఉంటూ రాజ‌కీయంగా పై చేయి సాధించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అందులో భాగంగా...వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసి బ్ర‌ద‌ర్స్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జేసి ప్ర‌భాక‌ర రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం తో జిల్లాలోని జేసి వ్య‌తిరేక వ‌ర్గం అయిన టిడిపి ఎమ్మెల్యేలు జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. త‌మ ప్ర‌క‌ట‌న ద్వారా టిడిపిలో వ‌చ్చే స్పంద‌న‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని జేసి బ్ర‌ద‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

వార‌సుల‌తో వారి లక్ష్యం నెర‌వేరేనా..!

వార‌సుల‌తో వారి లక్ష్యం నెర‌వేరేనా..!

జేసి బ్ర‌ద‌ర్స్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. దీంతో..అక్క‌డి నుండి వారి వార‌సుల‌ను బ‌రిలోకి దించ‌టానికి రంగం సిద్ద‌మవుతోంది. అనంత‌పురం ఎంపీగా జేసి దివాక‌ర‌రెడ్డి స్థానంలో ఆయ‌న త‌నయుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డిని అనంత‌పురం ఎంపీగా బ‌రిలోకి దించే అవ‌కాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి అనంత‌పురం ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనూ త‌న హెలికాఫ్ట‌ర్‌లో ప‌వ‌న్ ను ప‌క్క‌న కూర్చోబెట్టుకొని పుట్ట‌ప‌ర్తి వ‌ర‌కు ప్ర‌యాణం చేసారు. అదే స‌మ‌యంలో ఈ ప్ర‌తిపాద‌న చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇక‌, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌భాక‌ర రెడ్డి స్థానం లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు పోటీ చేస్తార‌ని స్వ‌యంగా ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. తాను తాడిప‌త్రి మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ గా పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. మ‌రి..త‌మ వార‌సుల‌కు రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పించ‌టం ద్వారా..జిల్లాలో త‌మ ఆధిప‌త్యం జేసి బ్ర‌ద‌ర్స్ కొన‌సాగించ‌గ‌లుగుతారా లేదా అనేది చ‌ర్చ నీయాంశంగా మారింది.

English summary
J.C Brothers anuonced key decision on their political future. They Decided to not contest in next elections. Brothers introducing their son's in coming elections from their seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X