అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సామీ! ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేస్తున్నారు, ఇది ఎక్కడి మాయ: బాబుపై జేసీ

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి బుధవారం ప్రశంసల వర్షం కురిపించారు. బైరవానితిప్ప ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా జేసీ మాట్లాడారు. విభజన తర్వాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, చిప్ప తీసుకొని చంద్రబాబు అమరావతి వచ్చారని చెప్పారు.

<strong>లోకేష్‌ను తీసేయండి, తువ్వాలుతో బయట స్నానం చేశాడు, జగన్‌లా ముద్దులు పెట్టను: పవన్</strong>లోకేష్‌ను తీసేయండి, తువ్వాలుతో బయట స్నానం చేశాడు, జగన్‌లా ముద్దులు పెట్టను: పవన్

ఇది ఎక్కడి మాయ, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు

ఇది ఎక్కడి మాయ, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు

ఇంత చిప్ప తీసుకు వచ్చారని, కానీ ఇన్ని ప్రాజెక్టులు ఎలా కడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎక్కడి మాయ ఇది అని అడిగారు. పోలవరం ప్రాజెక్టు మొదలు అన్నింటా నరేంద్ర మోడీ.. చంద్రబాబుకు మూడు నామాలు పెట్టి, బిచ్చగాడిని చేసి, ఫెయిల్యూర్ చేయాలని చూస్తే, మీరు (చంద్రబాబు) మాత్రం పోలవరానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు సామీ.. అని అడిగారు.

అక్షయపాత్ర ఉందా?

అక్షయపాత్ర ఉందా?

డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చంద్రబాబును జేసీ అడిగారు. నాకో విషయం చెప్పండి.. మీ వద్ద ఏమైనా అక్షయపాత్ర ఉందా లేక డబ్బులు ముద్రించే మిషన్ ఉందా చెప్పాలని అడిగారు.

ఇలాంటి మహానుభావుడిని చూడలేదు

ఇలాంటి మహానుభావుడిని చూడలేదు

అనంతపురంను నీటితో తడుపుతున్న వ్యక్తి చంద్రబాబు అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయనను మించిన మహానుభావులు ఉండరని చెప్పారు. ఇంతటి మహానుభావుడిని నేను చూడలేదన్నారు. మా జిల్లా కోసం ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇలా కష్టపడలేదన్నారు. తన ఆరాద్య దైవం నీలం సంజీవరెడ్డి అని, అలాంటి వ్యక్తి కూడా చంద్రబాబులా కష్టపడలేదన్నారు.

మోడీ కంటే నేను సీనియర్

మోడీ కంటే నేను సీనియర్

అంతకుముందు చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉన్నాం కదాఅని వీర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. మోడీ పేరు ఎత్తితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందన్నారు. అన్నీ ఆలోచించి ఉప ఎన్నికలు రాకుండా వైసీపీ నేతలు ఎంపీ పదవులకు రాజీనామా చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. మోడీ కంటే తాను సీనియర్ రాజకీయ నాయకుడినని, తనను పట్టుకొని మెచ్యూరిటీ లేదని అంటారా అని మండిపడ్డారు. ఓ దశలో బీజేపీ దేశవ్యాప్తంగా రెండు సీట్లకు పరిమితమైన సమయంలో ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి 35 సీట్లు వచ్చాయని చెప్పారు.

English summary
Anantapur MP JC Diwakar Reddy asked AP CM Nara Chandrababu Naidu over funds for Polavaram and other projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X