దోచుకున్నవారా: బాబు, సీమకు కృష్ణా నీరు: జెసి

అనంతపురం: కృష్ణా వరదజలాలను రాయలసీమకు కేటాయించాలని, హెచ్‌ఎల్పీ, హంద్రీనీవా కాలువలను వెడల్పు చేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి కోరారు. సోమవారం అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో వ్యవసాయ మిషన్‌ ప్రారంభ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ఎంత డబ్బు ఖర్చు అయినా రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా పథకాన్ని ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పరిటాల సునీతతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా పాల్గొన్నారు.

 JC Diwakar Reddy bats for Krishna flood water

మేఘమథనంతో దోచుకున్నవారు కూడా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు చెల్లని కాసులతో సమానమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇక్రీశాట్‌ సాయంతో అనంతపురం జిల్లాలో కరువును తరిమికొడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాలో వేరుశెనగ విత్తన పరిశోధన సంస్థ, నూనెగింజల పరిశ్రమ, జిగురు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. హంద్రీనీవా రూపకల్పన చేసింది ఎన్టీఆరే అని, ఇప్పుడు దానిని పూర్తి చేసే బాధ్యత నాదేనని ఆయన అన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి తొలిదశలో జిల్లాకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

హెచ్‌ఎల్పీ నుంచి జిల్లాకు పూర్తి నీరు రావడంలేదని, హెచ్‌ఎల్పీ నీటి వాటాపై కర్నాటక ముఖ్యమంత్రితో చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయం కల్పిస్తామని, మిగతా రైతులకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయం కలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో పండ్లతోటలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాటర్‌ గ్రిడ్‌ను ఆనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఒక సెంట్రల్‌ యూనివర్శిటీ, హిందూపురంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే గోరంట్ల మండలం పాలసముద్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటు, జిల్లాను టూరిజం, హార్జికల్చర్‌ హబ్‌లుగా మారుస్తామని, ప్రాజెక్టులతో చెరువులు నింపుతామని చంద్రబాబు నాయుడు జిల్లాకు వరాలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+