బాబు ఏదీ తొందరగా తేల్చరు, నాపై దాడి చేశారు: జేసీ, ఇవీ ప్రబోధానంద వీడియోలు!
Recommended Video

అమరావతి: ఇటీవల అనంతపురంలో చోటు చేసుకున్న ఘర్షణపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ప్రబోధానంద వీడియో క్లిప్పింగులను చంద్రబాబుకు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు చెప్పవలసింది చెప్పానని తెలిపారు. ఈ సందర్భంగా అధినేతపై సెటైర్ వేశారు కూడా. చంద్రబాబు ఏదైనా తొందరగా తేల్చే మనిషా అని వ్యాఖ్యానించారు. ఆయనకు తాను వీడియో క్లిప్పింగులు చూపించానని, తర్వాత చూసుకుంటానని తనకు చెప్పానని అన్నారు.

ప్రబోధానంద బలవంతుడు కాబట్టే నాపై దాడి చేశాడు
ప్రబోధానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రబోధానంద పైన తాను ఫిర్యాదు చేశానని, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన చేతుల్లో ఉందని చెప్పారు. చంద్రబాబు అన్నీ వింటాడని, కానీ త్వరగా నిర్ణయం తీసుకోడని అభిప్రాయపడ్డారు.

ఆశ్రమం చాలా పెద్దది
అనంతపురం జిల్లా చిన్నపొలమాడలోని ప్రబోధానంద ఆశ్రమంలో 500 గదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ఇందులో కొన్ని గదులను భక్తులు శాశ్వతంగా తీసుకున్నారు. వాటికి తాళాలు వేసుకున్నారు. ఈ ఆశ్రమాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో 11 బృందాలు తనిఖీ చేశాయి. కింద అంతస్తులో హాలు ప్రార్థనా మందిరం, పక్కనే ప్రింటింగ్ మిషన్, పై అంతస్తులో భక్తులకు గదులు ఉన్నాయి. భక్తులను ఖాళీ చేయించారు. అయితే శాశ్వత నివాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు తెలిపింది.

గతంలో ఆశ్రమానికి జేసీ దివాకర్ రెడ్డి
ఈ ఆశ్రమాన్ని మూసివేయాలని జేసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే గతంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఈ ఆశ్రమానికి ఆయన రెండుసార్లు వచ్చినట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఆశ్రమాన్ని 2003లో నిర్మించగా, ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు ఓ గ్రంథ ఆవిష్కరణకు హాజరయ్యారు.

మీడియాకు కూడా వీడియోలు
ప్రబోధానంద స్వామికి సంబంధించిన వీడియోలను చంద్రబాబుకు చూపిస్తానని జేసీ దివాకర్ రెడ్డి మంగళవారమే చెప్పారు. తాను సీఎంకు కొన్ని వీడియోలు చూపిస్తానని, పది నిమిషాలు సమయం కావాలని మంగళవారం అసెంబ్లీకి వచ్చి చెప్పారు. అయితే చంద్రబాబు శాసన సభ సమావేశాల్లో బిజీగా ఉండటంతో బుధవారం చూస్తారని చెప్పారు. దీంతో ఈ రోజు చూపించారు. ఆయన ఈ వీడియోలను మీడియాకు కూడా విడుదల చేస్తానని చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications