జేసీ దివాకర్ బస్సులు ఉన్నట్టుండి భగ్గు..
Diwakar Travels: అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. మంటలు మరిన్ని బస్సులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటం, బస్సులో షార్ట్ సర్క్యుట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తోన్నారు.

అనంతపురంలో ఈ ఘటన సంభవించింది. బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన బస్సులు అవి. ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదానికి గురయ్యాయి. తొలుత ఓ బస్సులో మంటలు చెలరేగాయి. భగ్గమంటూ అగ్నికీలలు వ్యాపించాయి. అక్కడే పార్క్ చేసి వుంచిన మరో నాలుగు బస్సులకూ మంటలు అంటుకున్నాయి.
దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే వాళ్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. మిగిలినవి పాక్షికంగా మంటల బారిన పడి కాలిపోయాయి.
ఆ బస్సులు పార్క్ చేసివుంచిన స్థలం పైనుంచి 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తోన్నాయి. అవి తెగిపడటం వల్ల మంటలు అంటుకున ఉండొచ్చని భావిస్తోన్నారు. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు. బస్సు డాష్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యుట్ జరిగి ఉండొచ్చనీ అనుమానిస్తోన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications