జగన్‌కు రూ.2 కోట్లు ఖర్చు, ప్రచారం వచ్చిందే కానీ, ఫలితం లేదు: జెసి ఎద్దేవా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాపై తెలుగుదేశం ఎంపి జెసి దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ ధర్నా కోసం ఆయన రెండు కోట్టు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

మంగళవారం ఢిల్లీలో జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ధర్నా వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రచారం వచ్చిందేమో కానీ, ఫలితం మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. నిరసనలు, దీక్షలు గాంధీ కాలంలో చెల్లేవని, బంద్ వల్ల రాష్ట్రానికే నష్టమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ ది మొసలి కన్నీరని విమర్శించారు.

లోక్‌సభలో వైయస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం

JC Diwakar Reddy fires at YS Jagan

ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టిడిపి లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నోటీసు ఇచ్చింది. తాజాగా మంగళవారం అదే అంశంపై చర్చకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

రేపు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు రేపు దిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.

మునికోటి ఆత్మహత్య దురదృష్టకరం: మంత్రి రావెల

మునికోటి ఆత్మహత్య దురదృష్టకరమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తూనే ఉన్నారని, ఎవరుకూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+