అవసరాన్నిబట్టి: మోడీ-బాబుల భేటీపై జేసీ మళ్లీ సంచలనం, అపాయింటుమెంట్ సరికాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్ ఇస్తారని వ్యాఖ్యానించారు.

ఛీకొడితే వచ్చావు, నీకేం సంబంధం: అంబటి రాంబాబుకు కోడెల కొడుకు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయ్యారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో తాము ఇచ్చిన ప్రదిపాదనలను ఏం చేశారని ఎంపీలు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడారు.

ఆపరేషన్ 'రివర్స్': జగన్ పార్టీలోకి విశాఖపట్నం కీలక నేత, అందుకే చేరిక!

 ఎంపీలు ఏం చేయలేరు, కరివేపాకులు

ఎంపీలు ఏం చేయలేరు, కరివేపాకులు

విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఏపీ ఎంపీలు ఏం చేయలేరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాము చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలని వ్యాఖ్యానించారు. ఎంపీలు అంటే కరివేపాకులా మారిపోయారని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 మనిషికి భయం ఉంటే అన్నీ వస్తాయి

మనిషికి భయం ఉంటే అన్నీ వస్తాయి

మనిషికి కొంచెం భయం ఉంటే అన్నీ వస్తాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. భయం లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ ఎప్పుడు మాట్లాడిన ఆసక్తికరంగా ఉండటంతో పాటు సంచలనంగా ఉంటాయి.

 రైల్వే జోన్‌పై చెప్పాల్సింది మోడీనే

రైల్వే జోన్‌పై చెప్పాల్సింది మోడీనే

రైల్వే జోన్ పైన చెప్పాల్సింది ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. అవసరం, సందర్భాన్ని బట్టి సీఎంకు మోడీ అపాయింటుమెంట్ ఇస్తారన్నారు. మరోవైపు, గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‍‌ను కలిశారు.

 అవసరాన్ని బట్టి అపాయింటుమెంట్ సరికాదు

అవసరాన్ని బట్టి అపాయింటుమెంట్ సరికాదు

మనిషికి కొంచెం భయం ఉంటే అన్నీ వస్తాయని, అందుకే చంద్రబాబుకు అవసరాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇచ్చారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అవసరాన్ని బట్టి అపాయింటుమెంట్ ఇవ్వడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and MP JC Diwakar Reddy hot comments on Prime Minister Narendra Modi appointment to Chief Minister Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X