అసలు రెడ్డే కాడు: జగన్‌పై మరోసారి జెసి సంచలన వ్యాఖ్యలు

వైయస్ జగన్‌పై జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు రెడ్డి కాడని, తానే అసలు రెడ్డినని ఆయన చెప్పుకున్నారు.

కృష్ణా: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మరోసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలం తాడినాడలో శుక్రవారం కోడి పందాల్లో ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మాగంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అసలు రెడ్డే కాడని వ్యాఖ్యానించారు.

జగన్ అసలైన రెడ్డీ కాదని, తానే రెడ్డినని చెప్పుకున్నారు. రాయలసీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని జేసీ అన్నారు. జేసీ స్వయంగా కోడి పందాలకు రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన అభిమానులు 'రామలసీమ పులిబిడ్డ' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు

JC Diwakar Reddy

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. ముచ్చుమర్రి, పులివెందులకు నీటి విడుదల, తదనంతర పరిణామాలపై సీఎంతో కొద్దిసేపు చర్చించారు. కోస్తా ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా సాగాయని జెసి అన్నారు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు చెప్పారు.

వైయస్ జగన్‌పై జెసి దివాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో జెసి ఆ వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డిపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో జెసి దివాకర్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+