'పవన్ కళ్యాణ్ ఆయన్ని నమ్ముకుంటే.. అంతే, జగన్ బీజేపీలో కలవాలంటే..'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇంకా ఎదగలేదని, ఆ పార్టీ చిన్న పరిధిలోనే ఉందని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

పవన్ పార్టీ ఇంకా ఒక చిన్న పరిధిలోనే ఉందని, మద్రగడ పద్మనాభాన్ని నమ్ముకున్నారని, ఆ పరిధి దాటి బయటకు రాకపోతే దానికి భవిష్యత్తు ఉండదని జేసీ చెప్పారు.

చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రివర్గంలోకి వస్తే తప్పేమిటో చెప్పాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.

JC Diwakar Reddy talks about Jana Sena and YSRCP

వైయస్ జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా? అనే కథనాలు ఇటీవల వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా జేసీ స్పందించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడతారని చెప్పారు.

అందులో అనుమానమే లేదన్నారు. కానీ బీజేపీ ఆయనకు ఆ హామీ ఇవ్వాలంటే చంద్రబాబును వదులుకోవడానికి సిద్ధపడాలన్నారు. చంద్రబాబును వదులుకుంటారా అంటే నమ్మకం తక్కువ అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Anantapur MP JC Diwakar Reddy make interesting comments on Pawan Kalyan's Jana Sena and YS Jaganmohan Reddy's YSRCP.
Please Wait while comments are loading...