జగన్ వైపే జెసి, బాబుపై ఫైర్: నోటీసుపై కాంగ్రెస్ డైలమా

రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీది రెండు కళ్ల సిద్ధాంతమని ఆరోపించారు. ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాత్రమే తెలంగాణ విషయంలో స్పష్టత ఉందన్నారు. తాను పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తమపై చర్యలు తీసుకుంటారన్నది స్పష్టమయ్యాకే స్పందిస్తానని తెలిపారు. తమ పిల్లలు ఏ పార్టీలో చేరుతారన్నది వాళ్లిష్టమన్నారు. పార్టీ మారే విషయమై మాత్రం తాను ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
జెసికి నోటీసుపై తర్జన భర్జన
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీనామా చేయాలని, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో ప్రయోజనం లేదన్న వ్యాఖ్యలపై జెసికి నోటీసు ఇచ్చే విషయమై పిసిసి తర్జన భర్జన పడుతోంది. ఏఐసిసి సభ్యుడైన జెసికి నోటీసు ఇచ్చే హక్కు తమకు లేదని క్రమశిక్షణా సంఘం చెప్పినట్లుగా తెలుస్తోంది. మీరే నిర్ణయం తీసుకోవాలని బొత్సకు లేఖ రాశారని సమాచారం. ఈ రోజు సాయంత్రం హైదరాబాదు రానున్న బొత్స ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
ఎవరికీ భయపడను
జెసికి షోకాజ్ నోటీసు ఇచ్చింది లేనిది తాను బహిరంగంగా చెప్పలేనని పిసిసి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ అన్నారు. తాను ఎవరికీ భయపడనన్నారు. జెసి వ్యాఖ్యల పైన గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications