నాతో జగన్‌కు పని ఉంది.. నాకవసరం లేదు, అందుకే అలా: జేసీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా వాగ్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, సోమవారం నాడు జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో జగన్‌కు పని ఉందని, కానీ తనకు మాత్రం జగన్‌తో ఎలాంటి అవసరం లేదని చెప్పారు. 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని భావిస్తున్నారన్నారు.

అందుకే ప్రతి ఒక్కరికి నేనే ముఖ్యమంత్రి అవుతానని చెబుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై జగన్, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications