దేవుడిని నమ్ముకో ఓకే, జగన్ ను నమ్ముకుంటే ఇదే పరిస్థితి, జేసీ బ్రదర్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇంతకాలం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన అధికారులకు ఆ దేవుడే సరైన శిక్ష వేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆ విషయాల గురించి అందరికి తెలుసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వాలు మారిన తరువాత రాజకీయ కక్షసాధింపులు సర్వసాధారణం అని, అయితే దానికి ఓ లిమిల్ ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులతోనే చెయ్యాలని, అయితే వైసీపీ నాయకులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో రాజకీయాలు చేశారని, ఈ రోజు వైసీపీ నాయకులను నమ్ముకున్న ఆ అధికారుల పరిస్థితి ఏమిటని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు.

ఒకటవ తరగతి నుండి చదివితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవుతారని, ఒకేసారి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కావాలనుకుంటే అది జీవితంలో జరగదు అని కొంతమంది తెలుసుకుంటే మంచిది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొంత మంది ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ కావాలని అనుకుంటారని, ఏమైనా చేయొచ్చా కానీ అది జరగదు అని ఆయన అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ చదివిన అధికారులను వైసీపీ ప్రభుత్వంలో చాలా చిన్నచూపుగా చూశారని ఆయన ఆరోపించారు.
ఈరోజు అదే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూటమి ప్రభుత్వం ముందు సమాధానం చెప్పలేక నిలబడి ఉన్నారని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాలు చేయాడానికి దేనికైనా హద్దు ఉంటుందని, ఇంత నిచమైన రాజకీయాలు చేసి ఉన్నత చదువులు చదివిన వారిని కించపరచడం అవసరం లేదని జెసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈరోజు సబ్ జైల్లో కండిషన్ బెయిల్ వచ్చిన ఖైదీలు లాగా ప్రతిరోజు పై అధికారుల దగ్గరకి వెళ్లి ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసి వస్తుంటే మాకు అవమానంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడం చూస్తే మాకే బాధగా ఉందని ఆయన అన్నారు. ఆ రోజు మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేసిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఈ రోజు ఏం సమాదానం చెబుతారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి వారిని ప్రశ్నించారు. మేం హాజరు సార్ అని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చెప్పాల్సిన పరిస్థితులు ఈరోజు అధికారులకి వచ్చాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications