బస్సు ప్రమాదం దురదృష్టకరం: జేసీ ప్రభాకర్ రెడ్డి, మృతులు వీరే
మంగళవారం తెల్లవారుజామన జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందిన ఘటనపై దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం చోటు చేసకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
విజయవాడ: మంగళవారం తెల్లవారుజామన జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందిన ఘటనపై దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బస్సు ప్రమాదం చోటు చేసకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గాయపడ్డవారిని ఆదుకుంటామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కోరామని తెలిపారు.

ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30మంది వరకు ప్రయాణికులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల వివరాలు:
-డ్రైవర్ ఆదినారాయణరెడ్డి(తాడిపత్రి)
-పంగా తులసమ్మ( సంతబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా)
-షేక్ పాషా( భవానీపురం, విజయవాడ)
-మధుసూదనరెడ్డి (ఒడిశాలో ఉద్యోగం.. హైదరాబాద్ వెళ్తున్నారు)
-నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి(పాండురంగాపురం, సూర్యాపేట జిల్లా). వీరిద్దరూ అన్నదమ్మలు
-సింగ్(కటక్, ఒడిశా)












Click it and Unblock the Notifications