జేసీ క్షమాపణలు - డబ్బు కోసం కాదు, సంచలన నిర్ణయం..!!
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయంగా చేసిన పోరాటం గురించి వివరించారు. ఆర్దికంగా ఎంత మేర నష్టపోయారో చెప్పుకొచ్చారు. తాజాగా ఫ్లై యాష్ వివాదం పై అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి క్షమాపణలు చెప్పారు. తాను డబ్బు కోసం రాజకీ యం చేయటం లేదని.. ప్రెస్టీజ్ కోసమే చేస్తున్నానని స్పష్టం చేసారు. తనకు చీము నెత్తురు ఉందని చెప్పిన జేసీ.. ఎవరికీ తల వంచనని బీజేపీ ఎమ్మెల్యే అదికి పరోక్షంగా హెచ్చరించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి .. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద వివాదం ఇంకా సమిసి పోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీ ప్రయత్నం చేసినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఆదాయం కోసం కాదు.. ప్రెస్టీజ్ కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తాను గత అయిదేళ్లు కాలంలో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. తమకు, వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉందని.. రాజారెడ్డి కాలం నుంచి పోయిందని వివరించారు. అయిదేళ్లు కాలంలో అన్నీ అమ్ముకు న్నామని చెప్పారు. కానీ, తాము ఏం తప్పు చేయలేదని పేర్కొన్నారు.

తమ ఇంట్లో లేని కారు లేదని చెప్పారు. తాను కావాలంటే క్లీనర్ గా పని చేస్తా, లేదా వాచ్ మెన్ గా అయిన పని చేసుకుంటానని వ్యాఖ్యానించారు. తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను జేసీ ప్రదర్శించారు. తన లారీలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని వివరించారు. పోలీసుల పైన జేసీ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన అన్న జేసీకి ఈ ఆలోచనల కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బ తిందని వెల్లడించారు. తాము ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నామన్నారు. తన కుమారులు ఇద్దరూ అలిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు.
తాను ఎవరికీ భయపడనని.. తాను ఇంట్లో ఉండే పెరుగన్నం తిని బ్రతుకుతానని వ్యాఖ్యానించారు. తాము 1952 నుంచి 2004 వరకు అందరికీ సాయం చేసామని చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి తమ ఇంటికి వచ్చిన సమయంలో తాను పెళ్లిలో ఉన్నానని చెప్పారు. అయితే సరెండర్ కావాలి లేదా ఎదురుపడి కొట్లాడాలి అని ఆలోచించానని జేసీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications