చంద్రబాబును కాదు, నిన్ను కొట్టిస్తా: జగన్‌పై జేసీ ప్రభాకర్
అనంతపురం : వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు అనంత రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పటికే జగన్ రైతు భరోసా యాత్రలను అడ్డుకోవడానికి టీడీపీ చేస్తోన్న ప్రయత్నాలను పోలీసులు నిలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పై కౌంటర్ ఎటాక్ చేశారు.
'చంద్రబాబును చెప్పుతో కొట్టడం కాదు, నిన్నే జనం చెప్పులతో కొట్టి ఊరేగించి కాలం వస్తుంది. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను జనం చేత చెప్పుదెబ్బలు కొట్టించగలను..' అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ. తను తలుచుకోవాలే గానీ పదంటే పది నిముషాల్లో జనం చేత ఆ పని చేయించగలనని హెచ్చరించారు.

అయితే జేసీ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక మరో కోణం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తొలి నుంచి జేసీ బ్రదర్స్ చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్న జిల్లా నేతలతో పోటీ పడాలంటే, చంద్రబాబు దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారట జేసీ బ్రదర్స్. ఈ క్రమంలోనే జగన్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తన గొంతు పెంచారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications