నీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి పండగ చేసుకోవాలా??
ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రజలు వినాయకచవితి పండగ జరుపుకోవాలా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో విఘ్నేశ్వరుడి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం సరైన చర్య కాదని మండిపడ్డారు. పందిళ్లు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే.
Recommended Video

నీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతించనివారికి నిద్ర లేకుండా చేయి స్వామీ అంటూ గణేషుడిని ప్రభాకర్ రెడ్డి ప్రార్థించారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న తనకే విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు తీసుకోవడం కష్టసాధ్యంగా ఉందని, అటువంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం.. అనుమతులిప్పంచండంటూ ఎంతో మంది వచ్చివెళుతున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదని వాపోయారు. వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు వెయ్యి రూపాయల రుసుము చెల్లించాలంటూ వస్తున్న వార్తలపై ఏపీ దేవదాయ, ధర్మాదాయశాఖ స్పందించింది. పందిళ్ల ఏర్పాటుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications