టిడిపిలో ఒలింపిక్ ఫైట్: గల్లా జయదేవ్‌పై జెసి కొడుకు సంచలన ఆరోపణలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి సంబంధించిన ఏపీ ఒలింపిక్ సంఘంపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుల సీఎం రమేశ్‌ల మధ్య పోరు సాగింది.

చదవండి: చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..

వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించిన ఇరు వర్గాలు తమ సంఘమే అసలుది అని ఓ వర్గం అంటే, కాదు తమదేనని మరో సంఘం మీడియాకెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి.

చదవండి: 'ఒలింపిక్' రగడ: గల్లా జయదేవ్‌తో జెసి తనయుడి ఢీ!

మాదే నిజమైన ఒలింపిక్ సంఘమని

మాదే నిజమైన ఒలింపిక్ సంఘమని

ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి తెరపైకి వచ్చారు. గల్లా జయదేవ్‌ను ఢీకొట్టారు. తమదే నిజమైన ఒలింపిక్ సంఘమని ప్రకటించారు.

గల్లా సంఘం చెల్లదు

గల్లా సంఘం చెల్లదు

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో కొంతమంది బోగస్ సంఘాన్ని నెలకొల్పి క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారని ఏపీవోఏ ప్రధాన కార్యదర్శి జెసి పవన్ రెడ్డి ఆరోపించారు. గల్లా అధ్యక్షుడిగా ఉన్న సదరు సంఘానికి భారత్ ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఇచ్చిన గుర్తింపు చెల్లదన్నారు.

హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు ఆదేశాలు

తప్పుడు పత్రాలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారని జెసి పవన్ రెడ్డి ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈ నెల 5న తీర్పు వచ్చిందన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ముగ్గురితో ఆర్బిట్రేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని 3 నెలల్లో పరిష్కరించాలని, అప్పటి వరకు రెండు సంఘాల కార్యకలాపాలు, బ్యాంక్ ఖాతాలను నిలిపివేయాలని ఐవోఏను కోర్టు ఆదేశించిందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా, వైషమ్యాలు పక్కన పెడదాం

నిబంధనలకు విరుద్ధంగా, వైషమ్యాలు పక్కన పెడదాం

గల్లా నేతృత్వంలోని సంఘం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్, పాన్ కార్డును పొందిందని జెసి పవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్బిట్రేషన్ తీర్పు వచ్చేదాకా వైషమ్యాలను పక్కన పెట్టి క్రీడాభివృద్ధికి పాటుపడదామని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ఇది అధినేత చంద్రబాబుకు తలనొప్పి అని చెప్పవచ్చు.

ఆ హోదాలో పవన్ పిటిషన్

ఆ హోదాలో పవన్ పిటిషన్

కాగా, గల్లా జయదేవ్ నేతృత్వంలోని సంఘాన్నే అధికారిక సంఘంగా గుర్తిస్తూ ఐఓఏ జారీ చేసిన ఉత్తర్వులను పవన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని పవన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో పవన్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

గల్లాపై సంచలన ఆరోపణలు

గల్లాపై సంచలన ఆరోపణలు

ఈ పిటిషన్‌లో గల్లా జయదేవ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని గల్లా జయదేవ్ ఏపీ ఒలింపిక్ సంఘాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ఆధ్వర్యంలోని సంఘమే అసలైనదని కూడా పవన్ రెడ్డి వాదించారు. తమ సంఘంలోని సభ్యుడు పురుషోత్తం, మరికొందరితో కలిసి గల్లా జయదేవ్ కుట్ర పన్ని... తమ సంఘం పేరుతోనే మరో సంఘం ఏర్పాటు చేశారని జెసి పవన్ ఆరోపించారు. రామచంద్రన్ కుమారుడు గల్లా జయదేవ్ కంపెనీల్లో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారని, ఈ కారణంగానే జయదేవ్‌కు రామచంద్రన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పిటిషన్‌లో గల్లా జయదేవ్‌తో పాటు పురుషోత్తం, రామచంద్రన్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏపీ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి, శాప్ వీసీ, ఐఓఏ కార్యదర్శి తదితరులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapur MP JC Diwakar Reddy's on JC Pavan Reddy fired at Telugu Desam leader and MP Galla Jayadev over olympic association issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X