టైటానియం స్కాంలో వైయస్ ఫ్యామిలీ: జగన్‌పై మళ్లీ జెసి

JC targets YS Jagan again
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. జగన్‌కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ధ్వజమెత్తారు. టైటానియం కుంభకోణంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. జగన్ ప్రభావం పైన దర్యాఫ్తు సంస్థలు నిగ్గు తేల్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

కాగా, వైయస్ జగన్ పైన జెసి దివాకర్ రెడ్డి గురువారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌కు పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. చిన్నప్పటి నుండి జగన్ అల్లరి చిల్లరగా తిరిగే వాడన్నారు. ఇంట్లో అందర్నీ కొట్టేవాడని విమర్శించారు. జగన్ స్నేహితులు మంగలి కృష్ణ, మొద్దు శీనులను చదువుకోమని ఇంగ్లాండుకు పంపితే నామాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు.

జగన్‌ను భరించడం సాధ్యం కాదని.. బెంగళూరుకు పంపిస్తానని స్వయంగా వైయస్ రాజశేఖర రెడ్డియే చెప్పారన్నారు. జగన్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఎవరికీ తెలియదన్నారు. దారినపోయే వారిని అడిగితే కనీసం పదివేల కోట్లు ఉన్నాయని చెబుతారన్నారు.

సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం 5 నుండి 10 కోట్ల రూపాయలు, ఎంపీ టిక్కెట్‌కు 35 నుండి 50 కోట్లు అడుగుతున్నారన్నారు. జగన్‌కు ఉన్నంత ధనదాహం ఎవరికీ లేదని ధ్వజమెత్తారు. మే నెల తర్వాత జగన్ పార్టీ ఉండదన్నారు.

జగన్ వంటి దురుసు స్వభావి చేతిలో రాష్ట్రాన్ని పెడితే అధోగతి తప్పదన్నారు. కాగా, జెసి దివాకర్ రెడ్డి ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని చెబుతూ పలువురు కాంగ్రెసు నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. జెసి ఇటీవలె టిడిపిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+