బాబులా జేడీ కాదు, వైస్రాయ్ హోటల్‌లో ఏం చేశారో: వర్మ సెటైర్

Subscribe to Oneindia Telugu
బాబులా జేడీ కాదు, వైస్రాయ్ హోటల్‌లో ఏం చేశారో ? | Oneindia Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. అంతేగాక, ఈ సినిమాలో పాత్రలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రోజుకో కొత్త విషయం చెబుతూ సినిమాపై ఆసక్తి పెంచాలని చూస్తున్నారు వర్మ.

 బాబు పాత్రపై వర్మ స్పందన

బాబు పాత్రపై వర్మ స్పందన

తాజాగా, తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వచ్చిన వార్తలపై వర్మ స్పందించారు.

‘బాబు కుట్ర, భయమేసేది! ఇష్టం లేకుండా మొదటి పెళ్లి, ఎన్టీఆర్ వల్లే మళ్లీ': లక్ష్మీపార్వతి సంచలనం

 కాదంటూ స్పష్టత..

కాదంటూ స్పష్టత..

తన చిత్రం(లక్ష్మీస్ ఎన్టీఆర్)లో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా జేడీ ఆ పాత్రను పోషించడం లేదని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ని తొలిసారి అక్కడే చూశా, ప్రేమ ఎప్పుడు పుట్టిందో: లక్ష్మీపార్వతి

మా మధ్యలో ఎవరో..

చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్మ చెప్పారు. తనకు, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మధ్య ఎవరో నటిస్తున్నారని అన్నారు. తనకు కూడా ఈ విషయం తెలియదని అన్నారు. అయితే, జేడీ మాత్రం కాదని తేల్చి చెప్పారు.

 వైస్రాయ్ హోటళ్లో బాబు..

వైస్రాయ్ హోటళ్లో బాబు..

కాగా, వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబు ఏం చేశారన్న విషయం తనకు నిజంగా తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీసేలా ఉన్నాయి. కాగా, ఈ చిత్రం గురించి రాంగోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీపార్వతి పాత్రలో నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్న విషయం తోలిసిందే. ఈ విషయంపై వర్మ అడిగితే స్పందిస్తానని రోజా ఇప్పటికే చెప్పారు.

రోజాపై క్లారిటీ ఇస్తా, ఆ దమ్ముంది: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'పై రాకేష్ రెడ్డి సంచలనం

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine Director Ram Gopal Varma has said that JD Chakravarthy is not acting as Nara Chandrabu Naidu in his Lakshmi's NTR cinema.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి