వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్‌పై టికి జెడి అల్టిమేటం: షిండేకు కోట్ల తీర్మానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

JD Seelam
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రపాలితం కాకుంచే వచ్చే పర్యవసానమేంటో చెప్పలేమని కేంద్రమంత్రి జెడి శీలం మంగళవారం అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోవాలని, అప్పుడే పార్లమెంటులో, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు సాఫీగా వెళ్తుందన్నారు.

యుటికి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మద్దతిస్తే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామన్నారు. అరవయ్యేళ్లు కలిసున్నామని, మరో మూడేళ్లు యూటిలో కలిసి ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. హైదరాబాదు యుటి అయితే తెలంగాణకు వచ్చే నష్టమేమీ ఉండదన్నారు. కెసిఆర్ తీరు కాంగ్రెసుకు వ్యతిరేకమన్నారు.

హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమే అన్నారు. యుటికి ఒప్పుకుంటే టి బిల్లు సాఫీగా ముందుకు వెళ్తుందన్నారు. ఇది తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆలోచించాలన్నారు. యూటికి సిద్దపడితే తాము విభజనకు సీమాంధ్ర ప్రజలను సముదాయిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ ఇచ్చిన తెలంగాణ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసుకోవాలంటే సహకరించాలన్నారు.

రాయల టిపై కోట్ల

రాయల తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మంగళవారం చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 1,700 గ్రామ సభల తీర్మాన కాపీలను షిండేకు కోట్ల అందజేశారు. ఈ కాపీలలో మంత్రి రఘువీరా రెడ్డి ప్రతిపాదనలు ఉన్నట్లుగా సమాచారం.

English summary

 Union Minister from Seemandhra, JD Seelam on Tuesday suggested Telangana Congress leaders to support UT status for Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X