హైదరాబాద్‌పై చంద్రబాబు పెత్తనం యత్నం: జీవన్ రెడ్డి

ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలను కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. అది రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే విధంగా గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదును పాలించాలని చూస్తున్నారని ఆయన విమర్శిచారు.
హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెడితే జరిగే పరిణామాలకు చంద్రబాబు నాయడే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీను చూపలేకపోవడంతో కాంగ్రెసు పరాజయం పాలైందని ఆయన అన్నారు.
స్థానిక ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications