మరో యువకుడితో సన్నిహితంగా ఉందని: ప్రియురాలిపై బ్లేడుతో దాడి
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతి తనతో వివాహానికి అంగీకరించలేదనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని వుడా పార్కులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతి తనతో వివాహానికి అంగీకరించలేదనే ఆగ్రహంతో ఓ ప్రేమోన్మాది బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని వుడా పార్కులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫేస్‌బుక్ పరిచయం
కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లికి చెందిన నాగలక్ష్మణ రావు మూడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. బాధిత యువతి విశాఖలోని ఓ హాస్టల్లో ఉంటూ బీఎస్సీ చదవుతోంది.

మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో
అయితే ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించి నిందితుడు ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖ బీచ్‌లోని వుడా పార్కుకు వెళ్లిన వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

తనను తాను బ్లేడుతో కోసుకున్నాడు
దీంతో నాగలక్ష్మణ రావు బ్లేడుతో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. బాధితురాలు కేకలు విని సమీపంలోని వారు వచ్చారు. దీంతో లక్ష్మణరావు తాను కూడా బ్లేడుతో కోసుకున్నాడు. బాధితురాలు కోలుకుంటోంది.

ఆమె పోలీసులకు ఏం చెప్పిందంటే
లక్ష్మణరావు ప్రేమ ప్రతిపాదన తేగా తాను తిరస్కరించానని బాధితురాలు చెప్పింది. దీంతో తనపై బ్లేడుతో దాడి చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది. లక్ష్మణరావు సింగరేణి గనుల్లో పని చేస్తున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications