ప్రేమించలేదని పగతో: ప్రేమోన్మాది ఆత్మహత్య (పిక్చర్స్)

హైదరాబాద్: తనను ప్రేమించలేదనే అక్కసుతో ఓ విద్యార్థి అమ్మాయిపై దాడి చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఓ విద్యార్థిని ప్రేమోన్మాది కత్తి దాడికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ప్రేమించమంటూ మూడేళ్లుగా ఆమెను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా ఇంత దారుణం జరిగింది.

ఆమెపై దాడి చేసిన ఆ దుర్మార్గుడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ మండలం బండ్లగూడ అరోరా ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో జరిగిందీ ఘటన. సిటీలోని రాంనగర్‌కు చెందిన ఒక యువతి ఈ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఆమె ఉండే ప్రాంతానికే చెందిన సీహెచ్‌ ప్రదీప్‌కుమార్‌ కుటుంబానికి అక్కడ ఒక కిరాణా కొట్టు ఉంది. ఇంటర్మీడియట్‌ చదువుతూ మధ్యలోనే ఆపేసిన ప్రదీప్‌కు దుకాణానికి వచ్చే ఆ యువతితో పరిచయమైంది. తర్వాత నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. తనను తప్ప మరొకరిని ప్రేమించకూడదని బెదిరించేవాడు. గత నెల 21న ఆమె సెల్‌ఫోన్‌ లాక్కుని తన గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రదీఫ్ అనే యువకుడు తనను వేధిస్తున్న విషయాన్ని ్మ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పి, 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు పిలిచారు.

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రదీప్‌కు తాము రెండుసార్లు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదని, నాగార్జున సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, దీంతో తాము కొంచెం వెనక్కి తగ్గినట్టు పోలీసులు చెబుతున్నారు.

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రేమోన్మాది ఘాతుకం

రవళి తనను ప్రేమించకపోగా, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పగబట్టిన ప్రదీప్‌ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం ఉదయం ఆమె వెనకాలే కళాశాలలోకి చొరబడ్డాడు. బ్యాగులో దాచుకుని తెచ్చిన కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో ఆమె కుడిభుజంపై, మెడపై బలంగా నరికాడు. తర్వాత అక్కణ్నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా సెక్యూరిటీగార్డులు పట్టుకున్నారు.

ప్రేమోన్మాది ఘాతుకం

ప్రేమోన్మాది ఘాతుకం

సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడం ప్రదీప్ తనతో తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా ప్రదీప్‌ చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+