కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jio 5G: నల్గొండ, చిత్తూరు, ఒంగోలు, కడప పట్టణాల్లో జియో 5జీ సేవలు..

నల్గొండ, చిత్తూరు, ఒంగోలు, కడప పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

దేశంలో 5జీ విప్లవం కొనసాగుతోంది. జియో, ఎయిర్ టెల్ ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. అయితే 5జీ సేవలు విస్తరించడంలో జియో కాస్త ముందుంది. జియో 5జీ సేవలు తెలంగాణలో మొదటగా హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చారు. తర్వాత జనవరి 10న కరీంనగర్, వరంగల్ లో రిల‌య‌న్స్ జియో ట్రూ 5జీ సేవ‌ల‌ను ప్రారంభించారు.

నిజామాబాద్, ఖమ్మం

నిజామాబాద్, ఖమ్మం

ఆ తర్వాత జనవరి 18న నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా నల్గొండ పట్టణంలో కూడా జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరికల్లా దేమంతటా 5జీ సర్వీస్ లాంచ్ చేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.జియో ట్రూ 5జి సేవలతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలు పెరగనున్నాయి.

143 నగరాలు

143 నగరాలు

ప్రస్తుతం జియో 5జీ సేవలను అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను వాడుకోవచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 143 నగరాలలో జియో ట్రూ 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో 5జీ ఆంధ్రప్రదేశ్‍లోని 9 నగరాల్లో అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, తాజాగా కర్నూలు, కాకినాడ నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా చిత్తూరు, ఒంగోలు, కడప సిటీల్లోనూ జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

కొత్తగా సిమ్

కొత్తగా సిమ్

జియో 5జీ కోసం యూజర్లు కొత్తగా సిమ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుందని వెల్లడించింది. తెలంగాణలో హైదరాబాద్ లో ఎయిర్ టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నంలో ఎయిర్ టెల్ 5జీ సేవలు ఉన్నాయి.

English summary
5G revolution is going on in the country. Jio and Airtel have already launched 5G services in many cities. But Jio is slightly ahead in expanding 5G services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X