Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జోగి రమేష్ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారు జామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. నోటీసు ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము కూడా అరెస్టును ఎదుర్కొంటోన్నారు. మొలకలచెరువులో భారీగా కల్తీ మద్యం తయారీ గుట్టు కొద్దిరోజుల కిందటే రట్టయిన విషయం తెలిసిందే. నిందితులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జీ జనార్ధన్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొలకలచెరువు కల్తీ మద్యం సరఫరా అయిందంటూ గతంలో వార్తలొచ్చాయి.

Jogi Ramesh arrest in Molakalacheruvu liquor case

కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తాజాగా అరెస్ట్ చేయనున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తోన్నారనే విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్ద గుమికూడారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ నాయకుడు జనార్దన్ చేసిన ఆరోపణలను ఇదివరకే తోసిపుచ్చారు జోగి రమేష్. తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని, నకిలీ మద్యంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశారు.

మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ కావడంతో కొత్తేమీ కాదు. జగన్ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్య వ్యాపారానికి పాల్పడినట్లు ఆరోపణలను లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఎదుర్కొంటోన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు.

తాజాగా మొలకలచెరువు కల్తీ మద్యం వ్యవహారం వైఎస్ఆర్సీపీని చుట్టుకుంటోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుడిభుజాల్లాంటి వారిని అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే- జోగి రమేష్, ఆయన తమ్ముడు రాముతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉచ్చుపన్నుతారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+