'ఇంటింటికి టీడీపీ డేరా బాబాలు.. ఏం సాధించారని ప్రజల వద్దకు?'

Subscribe to Oneindia Telugu

విజయవాడ: టీడీపీ చేపట్టబోతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యాచరణను వైసీపీ నేత జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో డేరా బాబాలు ఇంటింటికి తిరిగేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఏం సాధించారని టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్తారని ప్రశ్నించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని జోగి రమేష్ ఆరోపించారు. టీడీపీ బాబాలు ప్రజల గడప తొక్కితే ఏం చేశారని వారే నిలదీస్తారని హెచ్చరించారు.

 jogi ramesh compared tdp leaders with dera baba's

రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బాబాలకు దేహశుద్ది చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP MLA Jogi Ramesh alleged that TDP cheated Andhrapradesh people with false promises.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి