యనమల వ్యాఖ్యలపై ఫైర్ అయిన జోగి రమేష్ .. కళ్ళు పోయాయా, మైండ్ బ్లాంక్ అయిందా అని ప్రశ్న

వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజలకు అంతా అర్ధం అయ్యిందని ప్రచారం పస తప్ప జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పస లేదని యనమల పేర్కొన్నారు .జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల విరుచుకుపడ్డారు. ఇక ఈ బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో యనమల వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు జోగి రమేష్ .

 యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం... యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందా ?

యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహం... యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందా ?

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుందని విమర్శించారు. ఇక బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆయన ఆరోపించారు . . సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ లోనే అన్ని వర్గాల వారికి పెద్దపీట వేశారని జోగి రమేష్ కితాబిచ్చారు.

యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అని ప్రశ్న వేసిన ఎమ్మెల్యే జోగి రమేష్

యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అని ప్రశ్న వేసిన ఎమ్మెల్యే జోగి రమేష్

రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తుంటే యనమలకు ఏమైనా కళ్లు పోయాయా అంటూ ప్రశ్నించారు. జగన్‌ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాడని విమర్శించారు జోగి రమేష్ . రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానికే చెల్లుతుందని జోగి రమేష్ స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు దశ ఉంది కానీ దిశ లేదని ఎద్దేవాచేశారు. 'బడ్జెట్‌లో నేనున్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్‌. నేను తిన్నాను అని కూడా చెప్పుకుంటే బాగుంటుందని ఏం ఉద్ధరించారని పథకాలకు వైఎస్ పేరు పెడుతున్నారని యనమల చేసిన వ్యాఖ్యలకు జోగి రమేష్ ప్రభుత్వ పథకాలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెడితే తప్పేంటని నిలదీశారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నెరవేరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఆ పథకానికి జగనన్న పేరు పెట్టామని చెప్పారు.

 త్వరలో టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామన్న జోగి రమేష్

త్వరలో టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామన్న జోగి రమేష్

అలాగే నవరత్నాల అమలుపై దృష్టి పెట్టామని ,నామినేటెడ్‌ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత తమకే దక్కుతుందని జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడైనా రిజర్వేషన్లు పాటించారా అంటూ మండిపడ్డారు. తొందర్లోనే 30 కమిటీలు వేసి టీడీపీ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను 80 శాతం ప్రజలకు అందించేలా బడ్జెట్ ఉందని అయితే యనమల మాత్రం ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదమన్నారు రమేష్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+