Jogi Ramesh ను మట్టబెట్టాలనే దాడి చేశారు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh) నివాసంపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన వెనుక మంత్రి నారా లోకేష్ ఆదేశాలే ఉన్నాయని జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై, తన కుటుంబంపై భవిష్యత్తులో ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మంత్రి లోకేష్‌దేనని స్పష్టం చేశారు.

తన ఇంటిపై జరిగిన దాడి వ్యక్తిగత అంశం కాదని, ప్రజాస్వామ్య విలువలపైనే జరిగిన దాడిగా జోగి వ్యాఖ్యానించారు. తనను రాజకీయంగా మట్టుబెట్టాలనే ఉద్దేశం లేకపోతే ఇలాంటి దాడికి పాల్పడేవారా? అని ప్రశ్నించారు. గతంలో 83 రోజులు జైలులో పెట్టినా సరిపోలేదా చంద్రబాబు? అంటూ సీఎం చంద్రబాబుపై కూడా మండిపడ్డారు.

Jogi Ramesh House Attack Former Minister Alleges Lokesh Behind Violent Assault in Ibrahimpatnam

తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని సీబీఐ సిట్ చార్జిషీట్‌లో ఎక్కడ ప్రస్తావించారో చూపించాలని తాను ప్రశ్నించానని జోగి చెప్పారు. తన ఆరాధ్య దైవం తిరుమలేశుడి ప్రతిష్టను ఫ్లెక్సీలు వేసి దిగజార్చే ప్రయత్నాలు జరుగుతుంటే మౌనంగా ఉండలేనన్నారు. లడ్డూ అంశంపై దుష్ప్రచారం చేస్తున్న లోకేష్‌పై తీవ్రంగా స్పందించడం తప్పా? అని నిలదీశారు. తన నాయకుడు వైఎస్ జగన్‌, వైసీపీపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అడ్డుకోవడం తన బాధ్యతేనని జోగి స్పష్టం చేశారు. అయితే, అదే కారణంగా తన ఇంటిపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి జరగడం దురదృష్టకరమని విమర్శించారు. నారా లోకేష్ ఆదేశాలతో, ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలోనే తనను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ ఇంటిపై టిడిపి శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై జోగి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు. ముందుగా రింగ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టిన వారు, అక్కడి నుంచి ఒక్కసారిగా జోగి నివాసం వైపు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, కార్యకర్తలు పోలీసులను నెట్టి వేసి ముందుకు సాగారు. అనంతరం కర్రలు, రాళ్లు, పెట్రోల్ బాటిళ్లతో జోగి ఇంటిపై దాడి చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్‌లోకి పెట్రోల్ బాటిల్ విసరడంతో మంటలు చెలరేగి, కారిడార్‌తో పాటు ఫర్నీచర్ దగ్ధమైంది. ఇంటి అంతా దట్టమైన పొగ కమ్మడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ ఘటనపై స్పందించిన జోగి రమేష్, తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లోకేష్‌పై తాను ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు నిందితుల అరెస్టులపై చంద్రబాబు సన్నాయి నొక్కులు వాయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే అక్రమ కేసుల పేరిట తనను, తన కుమారుడిని, తన తమ్ముడిని జైలుకు పంపే ప్రయత్నాలు చేసేవారు కాదని జోగి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+