దద్దమ్మల్లా బెజవాడలో: 'వెంకయ్య ఇప్పుడు వంకయ్య అయ్యారు'

అమరావతి: చంద్రబాబు ఎప్పుడూ తాను నిప్పు నిప్పు అంటుంటారని, నిజంగా ఆయన నిప్పే అయితే ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని, అలా సాధించకపోతే ఆయన తుప్పే అవుతారని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విమర్శించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజలు ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎదురుచూస్తుంటే, కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఆ మాట అంటే జనం చెంపమీద కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో అమ్మేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. గత కొన్ని రోజులుగా దీనిపై నాటకాలు జరుగుతున్నాయని, ఈరోజు ఫైనల్ స్టేజికి వచ్చిందని అన్నారు. ఢిల్లీ పెద్దలంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెలిఫోన్లో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు హోదా అవసరం లేదని, ప్యాకేజి అవసరం లేదని, రైల్వే జోన్ అవసరం లేదని, తనకు కావల్సిందల్లా డీలిమిటేషన్ మాత్రమే అంటున్నారని ఎద్దేవా చేశారు. ముందు డీలిమిటేషన్ జరిగితేనే మిగతా వాటికి ఒప్పుకొంటానని ఢిల్లీ పెద్దలతో చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు లాంటి నీచ, నికృష్ట సీఎం ఎవరూ ఉండరు

చంద్రబాబు లాంటి నీచ, నికృష్ట సీఎం ఎవరూ ఉండరు


చంద్రబాబు లాంటి నీచ, నికృష్ట సీఎం ఎవరూ ఉండరని దుయ్యబట్టారు. ఒకరోజు హోదా అని, ఇంకో రోజు ప్యాకేజి వైపు కేంద్రం మొగ్గు చూపుతోందని అంటారని, మళ్లీ మిగతా రాష్ట్రాలతో సీఎంలతో ప్యాకేజీ కోసం సంప్రదింపులు అంటున్నారని, ఏపీకి ప్యాకేజీ ఇవ్వాలన్న మిగతా రాష్ట్రాల సీఎంలను సంప్రదించాల్సిన స్థితిలో ఉన్నామా అని నిలదీశారు.

 వెంకయ్య నాయుడు ఇప్పుడు వంకయ్య నాయుడుగా మారిపోయారు

వెంకయ్య నాయుడు ఇప్పుడు వంకయ్య నాయుడుగా మారిపోయారు

వాళ్ల మాటలకు తాన తందానా అంటూ సుజనా చౌదరి, పెద్దనాయకుడు వెంకయ్య నాయుడు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భంలో ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు వంకయ్య నాయుడుగా మారిపోయాడని విమర్శించారు. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం నీతి తప్పారని, మాట తప్పారని అన్నారు. ఆయన ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. బుధవారం ఉదయం నుంచి అందరం హోదా కోసం ఎదురు చూస్తుంటే, నియోజకవర్గాల పెంపు కోసం రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడామని సుజనా చౌదరి చెబుతున్నారని, ప్రజలు ఆయనను చెంపమీద కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జోగి రమేష్ తెలిపారు.

 డీలిమిటేషన్ చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా?

డీలిమిటేషన్ చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా?

ప్రత్యేకహోదా తెమ్మని మిమ్మల్ని కేంద్రమంత్రి చేస్తే.. మీరు అడిగేది ఏంటి.. డీలిమిటేషన్ చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలని, విజయవాడలో కూర్చుని ప్రగల్భాలు పలకడం మానుకోవాలని అన్నారు. డీలిమిటేషన్ మీకు, మీ పార్టీకి కావాలేమో గానీ ఐదు కోట్ల మంది ప్రజలకు అక్కర్లేదని, వాళ్లకు కావల్సింది ప్రత్యేక హోదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దాన్ని సాధించలేక దద్దమ్మల్లా విజయవాడలో కూర్చుని మాట్లాడతారేంటని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకు విలువలేదా? ప్రధాని ఇచ్చిన హామీకి విలువలేదా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+