గోల్డ్ స్టోన్ ప్రసాద్, దీపక్ రెడ్డిలు బాబుకు పెట్టుబడిదారులు: జోగురమేష్
విశాఖలో భూ కబ్జాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందరి బండారం బయటపడుతోందన్నారు.
విజయవాడ:విశాఖలో భూ కబ్జాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందరి బండారం బయటపడుతోందన్నారు.
ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకబ్జాలు చోటుచేసుకొంటున్నాయని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపితే విశాఖ భూ కుంభకోణంలో పెదబాబు, చినబాబు, మంత్రుల పాత్రలు బయటపడుతాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా టిడిపి నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. భూమలు వ్యవహరంలో చంద్రబాబుపాత్ర ఏమిటనేది తేలలన్నారు. స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే కబ్జాల గురించి చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు.
టీడిపి మాయగాళ్ళు ఎక్కడికక్కడ భూములను కబ్జాచేస్తున్నారని చెప్పారు. టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలంగాణలో అరెస్టు అయ్యారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు దీపక్ రెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ లు పెట్టుబడిదారులని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications