జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అందడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం... 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది.
ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.అంతేకాకుండా అత్యాచారం కూడా చేశాడని ఆ యువతి చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపింది. జానీ మాస్టర్ దగ్గర జాయిన్ మొదటి రోజు నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆ యువతి తెలిపింది. ప్రతీసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది.

అంతేకాదు కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని.. షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలవంతం చేశాడని తన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. నేను నో చెప్పేసరికి నా తలను అద్దంకేసి కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాట్‌కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్‌కు లొంగలేదని ఆమె తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని.. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు సైతం తెలుసునని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఆమె కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని సదరు యువతి తెలిపింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వివాదంపై జనసేన రియాక్ట్ అయింది. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications