జానీ మాస్టర్ వివాదంపై ఆయన భార్య తొలి రియాక్షన్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో 'ఢీ' షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని తెలిపింది.
2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.

తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా జానీ మాస్టర్ భార్య అయేషాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని తెలపడం జరిగింది. జానీ మాస్టర్ పది మందికి ఉపయోగపడే పనులే చేశారు కానీ,ఇలాంటి పనులు చేయరని ఆమె చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ ఎంతో మంచిగా ఉంటారని, అందుకే స్టార్ హీరోలు ఆయనకు వరుస అవకాశాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా అయేషా చెప్పుకొచ్చారు. జానీ ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారని, చివరికి ఆయనకు మంచే జరుగుతుందని ఆమె తెలిపారు. అయితే ఈ వీడియో పాతదని తెలుస్తోంది. గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వివాదంపై జానీ మాస్టర్ ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications