మహా శివరాత్రి నాడు తిరుపతిలో టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు: 12 గంటల పాటు నిర్విరామంగా
ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి. ఈ సందర్భంగా తిరుపతిలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం కార్యక్రమం ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని నిర్వహించనుంది. సాయంత్రం 6 నుండి అర్థరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాం ఇది. రామచంద్ర పుష్కరిణి, మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం.. వీటికి వేదికలు. హెచ్ డీపీపీ, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఇందులో పాల్గొననున్నారు.
సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో మహాశివరాత్రి నాటి జాగారానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఆలయాల వద్ద రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పంథాలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుపతి మహతి క్షేత్రంలో ఎం సరళ బృందం శివస్తోత్ర పారాయణం, జీ ప్రభాకర్ శర్మ పురాణ ప్రవచనం, సీ హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు.
కపిలతీర్థంలో వీ ప్రసన్న లక్ష్మీ బృందం శివస్తోత్ర పారాయణం, ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, సీహెచ జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం, వై వేంకటేశ్వర్లు సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
అన్నమాచార్య కళామందిరంలో జీ ఇందిరారాణి బృందం శివస్తోత్ర పారాయణం, వీ నిర్మలా బాయి పురాణ ప్రవచనం, సీహెచ్ అజయ్ కుమార్ బృందం పార్వతి పరిణయం నృత్య రూపకం, జే కృష్ణ కుమారి పార్వతి పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు.
రామచంద్ర పుష్కరిణి వద్ద జే రాజకుమారి బృందం శివస్తోత్ర పోరాయణం, కే నారాయణ రావు పురాణ ప్రవచనం, సీ సాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివ లీలలు నృత్య రూపకం, ఎం రాముడు ఆధ్వర్యంలో భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications