లడ్డూబాబు మేకప్: టిడిపిపై వాసిరెడ్డి, సింగిల్‌గా: శౌరి

శాసన సభలో ప్రతిపక్ష నేతగా పదేళ్లలో ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. ఇన్నేళ్ల పాటు చంద్రబాబు ఎవరి తరఫున పోరాడారో చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. టిడిపి ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను ఎప్పుడు నిర్వర్తించలేదన్నారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి నూకలు చెల్లాయని, దాంతో ఆ పార్టీలోని మాజీ మంత్రులు, సీనియర్లు అంతా జంపింగ్ రాగం ఆలపిస్తూ టిడిపిలో చేరుతున్నారన్నారు. దానిని చూసి చంద్రబాబు ఊబ్బితబ్బిబ్బవుతున్నారని, రానున్న ఎన్నికల్లో టిడిపిదే విజయమనే భావనలో చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు.
సింగిల్‌గా: బాలశౌరి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ సింగిల్‌గా పోటీ చేసి చంద్రబాబుకు బుద్ధి చెబుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాలశౌరి వేరుగా అన్నారు. విశ్వసనీయతకు మారుపేరు అయిన జగన్ పార్టీని ప్రజలు ఆదరిస్తారన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ నేతలను కాంగ్రెసులోకి పంపిస్తున్న చంద్రబాబు, సీమాంధ్రలో కాంగ్రెసు నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు.
బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పిన చంద్రబాబు.... ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారన్నారు. మాట మీద నిలబడలేని చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. 2009లో మహాకూటమితో వైయస్‌ను దెబ్బ తీయాలని చూస్తే, ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పుడు కూడా పొత్తుల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
లోకసభ కోసం దరఖాస్తు చేయలేదు: పొన్నాల
తాను లోకసభ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయలేదని తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య బుధవారం అన్నారు. పొన్నాల జనగామ అసెంబ్లీతో పాటు భువనగిరి లోకసభలో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. లోకసభ టికెట్ తానెప్పుడూ అడగలేదన్నారు. ఆ టికెట్‌కు దరఖాస్తు కూడా చేయలేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని తాము రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు. కాంగ్రెస్‌తో ఎవరైనా కలసి వస్తానంటే స్వాగతిస్తామని తెలిపారు. అన్నిస్థాయిల నివేదికలతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థిత్వ నిర్ణయం ఉంటుందని, సిట్టంగులకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఈ నెల 28 నాటికి అభ్యర్థుల ప్రకటన చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, మహిళలు, యువతకు సముచిత ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి అందరం పని చేస్తామన్నారు. పూటకో మాట మాట్లాడే వారిని ప్రజలు ఏమాత్రం విశ్వసించరని చెప్పారు.
ఎపిసిసి ఉపాధ్యక్షులుగా వట్టి
కాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) ఉపాధ్యక్షులుగా వట్టి వసంత్ కుమార్ నియమితులయ్యారు. ఎపిసిసి అధికార ప్రతినిధిగా రుద్రరాజు పద్మరాజును నియమించారు.












Click it and Unblock the Notifications