సభలో విచిత్రం: జెపి, టిడిపి డబుల్ గేమ్: హరీష్ రావు

ప్రజల మనోభావాలను వ్యక్తం చేయడానికి సభ నడవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. లోక్‌పాల్ బిల్లు వచ్చిందని సంబరపడాల్సిన అవసరం లేదని, ఆ బిల్లుతో మన బతుకులు బాగుపడవన్నారు. రాష్ట్రాన్ని అధికారులు, నేతలు కలిసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి డబుల్ గేమ్: హరీష్ రావు
బిల్లు పైన తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందని తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర టిడిపి నేతలు చర్చను అడ్డుకోకుండా టిటిడిపి నేతలే కట్టడి చేయాలన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు రెండు మూడు రోజుల్లో చర్చను ముగించారన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణిని మానుకోవాలన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చించేందుకు 42 రోజులు అవసరమా అని ప్రశ్నించారు. నెలాఖరులోగా చర్చను పూర్తి చేసి రాష్ట్రపతికి పంపించాలన్నారు. బిల్లుపై చర్చ పూర్తి చేయించే బాధ్యత తెలంగాణ మంత్రులదే అన్నారు. సభ జరగకుండా అడ్డుకుంటే ఊరుకోమన్నారు. సభను అడ్డుకుంటే సభాపతి వారిపై వేటు వేయాలని కోరారు. సీమాంధ్ర నేతలు చర్చకు అడ్డుపడకుండా సహకరించాలని టిటిడిపి నేతలు కోరారు.












Click it and Unblock the Notifications