బాబుతో భేటీ: గద్దె మీద ఏ గాడిదంటూ జెపి వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి శనివారం వచ్చిన జెపి మీడియాతో మాట్లాడారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఢిల్లీ పెద్దలు తమకు తోచిన పద్ధతిలో వ్యవహరిస్తున్న తీరు దేశ ఐక్యతకు ప్రమాదకరమని, ఇదే ధోర ణి కొనసాగితే ముప్ఫై ఏళ్ళలో దేశం విచ్ఛిన్నం కావడం తథ్యమని హెచ్చరించారు. పంజాబ్‌లో పెట్టిన చిచ్చు ఆరడానికి ఇరవై ఏళ్ళు పట్టిందని, ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైన అంశం దేశ విచ్ఛిన్నానికి దారి తీసినా ఆశ్చర్య పడనక్కరలేదని వ్యాఖ్యానించారు.
సమగ్ర చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా వచ్చే తెలంగాణను తాము స్వాగతిస్తామని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రస్తుత సమస్య పరిష్కారంలో ప్రధాన పాత్ర ఉందని, తెలుగుదేశ పార్టీ సహా అన్ని పార్టీలు తెలంగాణ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొంటూనే ఇతర ప్రాంతాల సమస్యలను పరిగణనలోకి తీసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబుతో ఇంత లోతుగా ఇన్ని విషయాలు మాట్లాడలేదని, కాకపోతే అనేక అంశాలపై మాట్లాడామని చెప్పారు.
"కేంద్రంలో ఉంది ప్రభుత్వమా లేక ప్రైవేటు కంపెనీనా? ఇదేమైనా వారి సొంత సామ్రాజ్యమా? ఈ మెయిళ్ళు పంపండంటే పంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు బానిసలా? నెహ్రూ, పటేల్, ఇందిర, వాజ్‌పేయి వంటి వారు కూడా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడలేదు. వాళ్ళ కంటే గొప్పవాళ్ళమని అనుకొంటున్నారా? దేశంలో వంద సీట్లు కూడా గెలవడం కష్టంగా ఉంది కాంగ్రెస్‌కి. ఈ పూట ఉంటారు. రేపు ప్రజలు పొమ్మంటే పోవాల్సిందే. మీ ఇష్టారాజ్యంగా ఎలా చేస్తారు?" అని జెపి అన్నారు.












Click it and Unblock the Notifications